కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతికి ఊహించని సంఘటన ఎదురైంది. ఎయిర్ పోర్ట్ లో విజయ్ సేతుపతి వెళ్తుండగా.. ఓ వ్యక్తి వెనుక నుంచి వచ్చి ఎగిరి తన్నాడు. దీంతో విజయ్ ఒక్కసారిగా షాకయ్యాడు. వెంటనే ఆయన పక్కన ఉన్నవారంతా అలెర్ట్ అయి.. విజయ్ పై దాడి చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. తనపై దాడి చేసిన వ్యక్తిని ఏమీ అనకుండా అక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్లిపోయాడు విజయ్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఎయిర్ పోర్ట్ భద్రతా అధికారులు విజయ్ సేతుపతిని జాగ్రత్తగా తీసుకెళ్లినట్లు కనిపిస్తోంది. ఈ దాడి వెనుక ఉన్న కారణాలేంటో మాత్రం తెలియలేదు. ఒక స్టార్ హీరోపై ఇలా దాడి చేయడం కరెక్ట్ కాదని.. అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ దాడికి బలమైన కారణం ఉండే ఉంటుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ దాడిలో విజయ్ కి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇక సినిమాల విజయానికొస్తే.. ఈ ఏడాది ‘ఉప్పెన’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ సేతుపతి ప్రస్తుతం తమిళ, మలయాళ, హిందీ చిత్రాలలో నటిస్తున్నారు. ఆయన చేతుల్లో ప్రస్తుతం పది సినిమాల వరకు ఉన్నాయి. త్వరలోనే ‘ముంబైకర్’ అనే సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నారు.