Balakrishna: స్టార్ హీరో బాలకృష్ణ ఇంటిపై దాడి.. కానీ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న వైసీపీ నేతలు తమ ఇళ్లపై, కార్యాలయాలపై దాడులు చేశారని టీడీపీ నేతలు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. నేడు ఏపీలో తెలుగుదేశం పార్టీ నేతలు బంద్ నిర్వహిస్తున్నారు. అయితే వైసీపీ కార్యకర్తలు హిందూపురంలోని బాలకృష్ణ ఇంటిపై కూడా దాడి చేశారని సమాచారం. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్ల వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బాలకృష్ణ ఇంటితో పాటు హిందూపురంలోని టీడీపీ కార్యాలయంపై కూడా వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారని వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ ఘటన జరిగిన సమయంలో బాలయ్య హైదరాబాద్ లోనే ఉన్నారని సమాచారం. కార్యకర్తలు, స్థానిక నేతల నుంచి బాలకృష్ణ సమాచారాన్ని తెలుసుకుంటున్నారని తెలుస్తోంది. త్వరలో బాలకృష్ణ హిందూపూర్ కు వెళ్లనున్నారని సమాచారం. వైసీపీ నేతల దాడులకు వ్యతిరేకంగా టీడీపీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటం గమనార్హం. మరోవైపు మరికొన్ని రోజుల్లో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారని సమాచారం. వచ్చే ఏడాది భారీగా పోటీ ఉన్న నేపథ్యంలో ఈ ఏడాదే అఖండ థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరగడంతో మేకర్స్ సరైన రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసే పనిలో పడ్డారని తెలుస్తోంది. నవంబర్ లో అఖండ రిలీజయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే అల్లు అర్జున్ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ దక్కవచ్చని తెలుస్తోంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus