Keerthy Suresh: కీర్తి సురేష్ పై అలాంటి అభిప్రాయం.. అవసరాల శ్రీనివాస్ ఏమన్నారంటే?

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) కెరీర్ గురించి మాట్లాడుకోవాలంటే మహానటి (Mahanati) ముందు మహానటి తర్వాత అని మాట్లాడుకోవాలి. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు నిర్మాతలకు మంచి లాభాలను అందించింది. ఈ సినిమాలో ఎల్వీ ప్రసాద్ అవసరాల శ్రీనివాస్ (Srinivas Avasarala) నటించి తన నటనతో మెప్పించారు. అయితే ఒక సందర్భంలో అవసరాల శ్రీనివాస్ చెప్పిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఎల్వీ ప్రసాద్ రోల్ లో నటించాలని కోరిన వెంటనే నేను అంగీకరించానని ఆయన తెలిపారు.

మహానటి సావిత్రి పాత్ర కోసం కీర్తి సురేష్ ను ఎంపిక చేశారని తెలిసి కీర్తి సురేష్ కమర్షియల్ హీరోయిన్ అని ఆమె దుఃఖం, ఇతర ఎమోషన్స్ ను పలికించగలదా అని సందేహం కలిగిందని అవసరాల శ్రీనివాస్ కామెంట్లు చేశారు. నాగ్ అశ్విన్ కీర్తిని ఎంపిక చేయడం రాంగ్ ఛాయిస్ అని భావించానని ఆయన పేర్కొన్నారు. ఫస్ట్ లుక్, పోస్టర్స్ విడుదలైన తర్వాత నా ఒపీనియన్ పూర్తిస్థాయిలో మారిపోయిందని ఆయన చెప్పుకొచ్చారు.

మహానటి సినిమాలో కీర్తి సురేష్ అద్భుతంగా నటించారని అవసరాల శ్రీనివాస్ తెలిపారు. అవసరాల శ్రీనివాస్ నటుడిగా, దర్శకుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. అవసరాల శ్రీనివాస్ ఈ ఏడాది ఈగల్ (Eagle) సినిమాలో ముఖ్య పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. కీర్తి సురేష్ కెరీర్ విషయానికి వస్తే తమిళంలో కీర్తి సురేష్ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.

మహానటి సినిమా తర్వాత తెలుగులో కీర్తి సురేష్ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. కీర్తి సురేష్ తెలుగులో మరింత బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కీర్తి సురేష్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా ప్రాజెక్ట్ ల ఎంపికలో కీర్తి మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!

‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus