2009లో వచ్చిన ‘అవతార్’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 13 ఏళ్ల క్రితమే వందల కోట్లు కలెక్ట్ చేసింది ఆ మూవీ. ఇక దానికి సీక్వెల్ గా ‘అవతార్ 2′(అవతార్ ది వే ఆఫ్ వాటర్) కూడా రాబోతున్నట్టు ప్రకటన వచ్చినప్పటి నుండి సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రపంచం మొత్తం ఎంతో ఆత్రంగా ఎదురుచూసిన ఈ సినిమా డిసెంబర్ 16 న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
దాదాపు 400 మిలియన్ డాలర్ల భారీ వ్యయంతో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ ఆడియన్స్ ను ఫిదా చేస్తుంది అనే చెప్పాలి. మొదటి రోజు కొంత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ జనం ఎగబడి ఈ చిత్రాన్ని చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మొదటి రోజుకే బ్రేక్ ఈవెన్ సాధించింది.వీకెండ్ వరకు సూపర్ గా కలెక్ట్ చేసింది. నిన్న 5 వ రోజు అయినప్పటికీ ఈ మూవీ చాలా బాగా కలెక్ట్ చేసింది. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 15.96 cr |
సీడెడ్ | 3.64 cr |
ఉత్తరాంధ్ర | 4.26 cr |
ఈస్ట్+ వెస్ట్ | 1.55 cr |
కృష్ణా +గుంటూరు | 3.05 cr |
నెల్లూరు | 1.15 cr |
ఏపీ + తెలంగాణ | 29.61 cr |
‘అవతార్ 2’ (అవతార్ ది వే ఆఫ్ వాటర్) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. చాలా ఏరియాల్లో రెంటల్ బేసిస్ మీద ఓన్ రిలీజ్ చేసుకున్నారు. దీంతో రూ.5.25 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ 5 రోజులు పూర్తయ్యేసరికి రూ.29.61 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది.
దీంతో బయ్యర్లు రూ.24.36 కోట్ల భారీ లాభాలను అందించింది. కొంత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ‘అవతార్ 2’ కి ఈ రేంజ్లో కలెక్ట్ చేస్తుండడం అంటే మామూలు విషయం కాదు. వీక్ డేస్ లో కూడా ఈ మూవీ మంచి కలెక్షన్లు రాబడుతోంది.
అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?
2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!