NET Trailer: ఉత్కంఠతను రేకెత్తించే విధంగా అవికా గోర్ ‘నెట్’ ట్రైలర్..!

రాహుల్ రామకృష్ణ, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘నెట్’ మూవీ వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న జీ5 ఓటిటిలో స్ట్రీమ్ కానున్న సంగతి తెలిసిందే.టెక్నాలజీ వినియోగం, సోషల్ మీడియా వినియోగం పెరిగిన నేపథ్యంలో కొందరు దానిని పాజిటివ్ గా ఉపయోగించుకుంటుంటే మరికొంతమంది నెగిటివ్ గా దుర్వినియోగ పరుచుకుంటున్నారు. ఈ క్రమంలో ఆన్లైన్ మోసాలు, బ్లాక్ మెయిలింగ్ లు వంటివి విపరీతంగా పెరుగిపోతున్నాయి.దీంతో పాటు స్పై కెమెరాలతో నిత్యం మనల్ని ఎవరో ఒకరు గమనిస్తూనే ఉంటారు… అనే థీమ్ తో వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ ‘నెట్’ తెరకెక్కింది.

‘తమడా మీడియా’ సంస్థ ఈ మూవీని నిర్మిస్తుండటం విశేషం. భార్గవ్ మంచర్ల దీనికి దర్శకుడు. ‘నెట్’ ద్వారా తొలిసారి ఓటిటి ఎంట్రీ ఇవ్వబోతుంది హీరోయిన్ అవికా. ఇక ప్రమోషన్లలో భాగంగా ‘నెట్’ కు సంబంధించిన ట్రైలర్ ను కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది చిత్ర బృందం. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. ‘నెట్’ ట్రైలర్ ను విడుదల చేశారు. ఓ అమ్మాయి(అవికా గోర్) హ్యక్డ్ లైఫ్ ను తెలియజేస్తూ ఈ ట్రైలర్ సాగింది. అవికా గోర్ ఉండే ఇంట్లో ఆమెకు తెలీకుండా ఓ స్పై కెమెరాలు ఉంటాయి. ఆమెని నిత్యం ఓ వ్యక్తి కనిపెడుతూ ఉంటాడు.. అతనే రాహుల్ రామకృష్ణ. మరోపక్క అతని ఫ్యామిలీ లైఫ్ ను కూడా చూపించారు. అతని భార్య(సుచిత్రా పట్నాయక్) ను అస్సలు పట్టించుకోడు.సంసార బాధ్యతల్ని గాలికి వదిలేస్తాడు.

‘మధ్యాహ్నం వస్తా అన్నావ్ రాలె.. ఇంటిని పెళ్ళాన్ని జర పట్టించుకోవచ్చు కదా..! ఏమైనా ఉంటే చెప్పుకోవచ్చు కదా’ అంటూ అతని భార్య సుచిత్ర ఆప్యాయంగా చెప్పగానే, రాహుల్ రామకృష్ణ.. కంచాన్ని కోపంగా విసిరేసి వెళ్లిపోతున్న సన్నివేశాన్ని బట్టి ఈ విషయం క్లియర్ గా స్పష్టమవుతుంది. ఎప్పుడూ అతని భార్యను వేధిస్తూనే ఉంటాడు.ఈ క్రమంలో ‘తనకి తెలీకుండా ఇతను ఏదో తప్పు చేస్తున్నాడు’ అనే అనుమానం ఇతని భార్యకు కలుగుతుంది. ఈ తరుణంలో వారి మధ్య సంభవించిన గొడవలు ఎలా ఉన్నాయి? అసలు రాహుల్ రామకృష్ణ… అవికా గోర్ లైఫ్ లోకి ఎందుకు ఎంటర్ అయ్యాడు.. ఆమె చేసే ప్రతీ పనిని ఎందుకు తన ఫోన్లో గమనిస్తున్నాడు?అలాగే అవికా ని మోసం చేస్తున్న వ్యక్తి ఎవరు.? అనే విషయాలను సస్పెన్స్ గా ఉంచుతూ.. ఆద్యంతం ఉత్కంఠతను రేకెత్తించే విధంగా ట్రైలర్ ను కట్ చేశారు.ట్రైలర్ చాల ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus