Avika Gor: సౌత్ ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన నటి అవికాగోర్!

బుల్లితెరపై ప్రసారమవుతున్న చిన్నారి పెళ్లికూతురు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి నటి అవికా గోర్ అనంతరం తెలుగులోకి ఉయ్యాల జంపాల సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమయ్యారు. హీరో రాజ్ తరుణ్ సరసన నటించిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత పలు తెలుగు సినిమాలలో నటించిన ఈమె ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

సౌత్ లో పెద్దగా సక్సెస్ కాలేకపోయినటువంటి ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నటువంటి ఈమె సౌత్ ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీ తో పోలిస్తే సౌత్ ఇండస్ట్రీలోనే ఎక్కువగా నేపోటిజం ఉందంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సౌత్ ఇండస్ట్రీ మొత్తం స్టార్ హీరోల పవర్ మీదే నడుస్తుందని, బాలీవుడ్ తో పోలిస్తే సౌత్ లో నెపోటిజం కాస్త ఎక్కువగానే ఉంది.

హిందీ సినిమాలకు అక్కడ ఆదరణ ఉండడం లేదని ఈమె తెలియజేశారు. సౌత్ ఇండస్ట్రీలో తెరకేక్కిన సినిమాలకు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది. అదే బాలీవుడ్ సినిమాలకు సౌత్ ఇండస్ట్రీలో ఎలాంటి ఆదరణ లేదని, బాలీవుడ్ చిత్రాలను ప్రేక్షకులు ఆదరించలేరని ఈమె తెలియజేశారు.ఇక తెలుగు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే అక్కడ బందు ప్రీతి ఎక్కువగా ఉందని ప్రజలు కూడా దానిని ఎంతో ఇష్టపడుతున్నారని ఈమె తెలియజేశారు.

బహుశా రాబోయే రోజుల్లో అది ఉండకపోవచ్చుఅంటూ ఈమె (Avika Gor) చేసిన కామెంట్లపై సౌత్ ప్రేక్షకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ పేరు డబ్బు సంపాదించుకొని బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత అక్కడ అవకాశాల కోసం సౌత్ ఇండస్ట్రీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అంటూ మండిపడుతున్నారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus