Avika Gor: నాన్నలాంటి వ్యక్తితో బిడ్డను కన్నానా : అవికా గోర్

చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు అవికా గోర్ పరిచయమయ్యారు. బాలికా వధు పేరుతో హిందీలో ఈ సీరియల్ ప్రసారం కాగా హిందీ, తెలుగు భాషల్లో ఈ సీరియల్ ఎంత పెద్ద హిట్ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సీరియల్ తర్వాత అవికా గోర్ మనీశ్ రాయ్ సింఘన్ అనే నటుడితో కలిసి పని చేశారు. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్నిరోజులుగా మనీశ్ రాయ్ సింఘన్, అవికా గోర్ మధ్య ఏదో సంబంధం ఉందని ప్రచారం జరుగుతోంది.

మనీశ్ రాయ్ సింఘన్, అవికా గోర్ కలిసి బిడ్డను కన్నారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే వైరల్ అయిన వార్తలపై తాజాగా అవికాగోర్ స్పందించి వివరణ ఇచ్చారు. మనీశ్ తన ఫ్రెండ్ అని 13 సంవత్సరాల వయస్సులో నటిగా ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి తమ మధ్య స్నేహం కొనసాగుతుందని ఆమె చెప్పుకొచ్చారు. మనీష్ నుంచి తాను చాలా నేర్చుకున్నానని తన లైఫ్ లో మనీష్ కు ప్రత్యేక స్థానం ఉందని అవికాగోర్ తెలిపారు.

తమ మధ్య ఏదో జరిగిందని చాలామంది అడుగుతున్నారని అయితే మనీష్ వయస్సు మా నాన్న వయస్సు ఒకటేనని అవికాగోర్ చెప్పుకొచ్చారు. ఈ పుకార్ల వల్ల మనీష్ కు దూరంగా ఉండటంలో అర్థం లేదనిపించిందని అవికా గోర్ వెల్లడించారు. ప్రస్తుతం తాను, మనీష్ క్లోజ్ ఫ్రెండ్స్ లా ఉన్నామని తమ గురించి వైరల్ అవుతున్న గాసిప్స్ చదివి నవ్వుకుంటామని అవికాగోర్ చెపుకొచ్చారు. తండ్రి లాంటి వ్యక్తితో బిడ్డను కన్నానా అంటూ అవికాగోర్ ఘాటుగా స్పందించారు.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus