బిగ్ బాస్ 4: ఎలిమినేషన్ లో ‘అవి’ ఎమోషనల్..!

బిగ్ బాస్ హౌస్ లో 9వ వారం ఎలిమినేషన్ అనేది చాలా నాటకీయంగా జరిగింది. చివర్లో అమ్మరాజశేఖర్ మాస్టర్ – అవినాష్ ఇద్దర్నీ బూత్ లో పెట్టి ఎవరు హౌస్ లో ఉంటారు.. ఎవరు వెళ్లిపోతారు అనేది చాలా ఆసక్తికరంగా చూపించారు. ఇక్కడే లాస్ట్ లో బూత్ లోనుంచి బయటకి వెళ్లిపోయి, తర్వాత స్టోర్ రూమ్ లోకి వచ్చిన అవినాష్ కి ఆల్ మోస్ట్ గుండె ఆగిపోయినంత పని అయ్యింది. ఇక బిగ్ బాస్ షోలో నుంచి ఎలిమినేట్ అయిపోతున్నాను ఎమో అనుకుని చాలా భయపడ్డాడు. ఇంతలా భయపడిపోవడానికి కారణం, ప్రస్తుతం తను ఉన్న పరిస్థితే. ఇదే విషయాన్ని హౌస్ లో పదే పదే చెప్పాడు కూడా.

అంతేకాదు, ప్రేక్షకులకి కూడా బయటకి వెళ్తే తనకి బతుకులేదని ఇండైరెక్ట్ గా చెప్తూనే ఉన్నాడు. లాస్ట్ టైమ్ టి స్టాండ్ టాస్క్ పూర్తి అయిన తర్వాత సోహైల్ తో మాట్లాడుతూ.. నేను షోలో నుంచి బయటకి వచ్చేశాను. ఇప్పుడు వెళ్తే బయట పరిస్థితి ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు అంటూ ఎమోషనల్ అయ్యాడు. అంతేకాదు, ఎప్పుడైతే ఎలిమినేషన్ ప్రోసెస్ లో బయటకి వెళ్లి మళ్లీ హౌస్ లోకి స్టోర్ రూమ్ లో నుంచి వచ్చాడో అప్పుడే మోకాళ్లపై పడి ఏడ్చేశాడు. అవినాష్ సిట్యువేషన్ చూసి, బాధని చూసి తోటి హౌస్ మేట్స్ కూడా బాగా ఫీల్ అయ్యారు. అక్కడే ఉన్న సోహైల్ – మెహబూబ్ ఓదార్చే ప్రయత్నం చేశారు.

నిజంగా ఎలిమినేట్ అయిపోయి ఉంటే అవినాష్ పరిస్థితి ఎలా ఉంటుందో అని అరియానా ముందుగానే హెచ్చరించింది. నువ్వు నాకోసం వెయిట్ చేస్తూ ఉండమని, పిచ్చిపనులు చేసుకోవద్దు అని చెప్పింది. అరియానాకి ప్రామిస్ చేసి బూత్ లోకి వెళ్లిన అవినాష్. ఈ ప్రోసెస్ లో తను ఎలిమినేట్ అయిపోయాననే అనుకున్నాడు. దీంతో చాలా బాధపడ్డాడు. నాగార్జున మాటలకి కాస్త ఊరటచెందిన అవినాష్ మళ్లీ మామూలు మనిషి అయ్యాడు.

ఇంకో మేటర్ ఏంటంటే, హౌస్ మేట్స్ చేసిన త్యాగాలవల్ల అవినాష్ కి తదుపరి వారం ఇమ్యూనిటి లభించింది. సో, ఈవారం అవినాష్ నామినేషన్ లో ఉండడన్నమాట. అదీ మేటర్.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus