బిగ్ బాస్ 4: ఆవుపాలకోసం ఫైనల్ ఫైటింగ్..!

బిగ్ బాస్ హౌస్ లో ఆవుపాలకోసం పెద్ద లొల్లి అయ్యింది. రేస్ టు ఫినాలే టాస్క్ లో భాగంగా లెవల్ 1 లో గార్డెన్ ఏరియాలో ఉన్న ఆవునుంచి వచ్చే పాలని హౌస్ మేట్స్ పట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరు ఎక్కువ పాలు కలెక్ట్ చేస్తారో వాళ్లు విజేతలుగా నిలుస్తారు. లెవల్ 2 లోకి వెళ్తారు. ఇక్కడే హౌస్ మేట్స్ మద్యలో పెద్ద ఫైటింగ్ అనేది జరిగింది.

ముఖ్యంగా మోనాల్ కి అలాగే అవినాష్ కి ఇద్దరికీ ఆర్గ్యూమెంట్ మొదలైంది. ఫస్ట్ అవినాష్ మోనాల్ పాలని కొట్టేశాడు. మోనాల్ పాలు రిటర్న్ ఇచ్చేవరకూ వెంటబడింది. ఇక్కడే మోనాల్ బాగా హర్ట్ అయ్యింది. అందుకే అవినాష్ ని కాలుతో తోసోసింది. దీన్ని ఇష్యూ చేస్తూ అవినాష్ మోనాల్ పైన విరుచుకుపడ్డాడు. అమ్మాయి కొడితే మీకు కనిపించదా అంటూ మాట్లాడాడు. అలాగే మోనాల్ షూని తీసి పారేశాడు. తన ఆవేశాన్ని వ్యక్తపరిచాడు. తర్వాత రూడ్ గా వెళ్లి పాలు పట్టుకునే ప్రయత్నం చేశాడు.

అఖిల్ చూసి ఆడు అంటున్నా, సోహైల్ ఆడనీ ఆడనీ అంటున్నా వాళ్లని బేఖాతరు చేశాడు. దీంతో సోహైల్ కి కోపం వచ్చి అవినాష్ పాల క్యాన్ ని తోసేశాడు. అవినాష్ ఇక నేను గేమ్ ఆడను అంటూ పక్కకి వెళ్లిపోయాడు. ఇక్కడ ఇద్దరి తప్పు ఉంది. ఫస్ట్ మోనాల్ పాలు కొట్టేయడం అవినాష్ తప్పు. అలాగే, మోనాల్ కాలితో అవినాష్ ని తోసేయడం తప్పు. తర్వాత అవినాష్ మాటలకి కోపం వచ్చిన సోహైల్ పాలక్యాన్ ని తోసేసి రూడ్ గా గేమ్ ఆడటం తప్పు.

ఫైనల్ గా ఆవుపాలకోసం ఫినాలే టిక్కెట్ కోసం హౌస్ మేట్స్ రచ్చ రచ్చ చేశారు. ఈ గేమ్ లో చివరకి మోనాల్, అరియానా, అవినాష్ ముగ్గురూ అవుట్ అయ్యారు. మిగిలిన నలుగురు లెవల్ టు కి వెళ్లారు. అదీ మేటర్.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus