కార్తీ, తమన్నా హీరోహీరోయిన్లుగా తమిళ స్టార్ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కించిన చిత్రం ‘ఆవారా’. తెలుగులో కూడా ‘యుగానికి ఒక్కడు’ సినిమా హిట్ అవ్వడంతో కార్తీకి ఇక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. దాంతో అతను నటించిన తర్వాతి చిత్రం ‘ఆవారా’ పై కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి.యువన్ శంకర్ రాజా సంగీతంలో రూపొందిన పాటలు కూడా హిట్ అవ్వడం ఈ సినిమాకి మరింత ప్లస్ అయ్యిందని చెప్పాలి. 2010 వ సంవత్సరం మే 21 న ఈ చిత్రం విడుదలయ్యింది. పోటీగా తెలుగు సినిమాలు చాలా ఉన్నప్పటికీ.. వాటి పోటీని తట్టుకుని మరీ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ చిత్రం. నేటితో ఈ చిత్రం విడుదలయ్యి 11 ఏళ్ళు పూర్తి కావస్తోంది.
ఫుల్ రన్లో అదీ తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసింది అనే విషయం పై ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
2.63 cr
సీడెడ్
1.12 cr
ఉత్తరాంధ్ర
1.60 cr
ఈస్ట్
0.57 cr
వెస్ట్
0.42 cr
గుంటూరు
0.47 cr
కృష్ణా
0.59 cr
నెల్లూరు
0.54 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
7.47 cr
‘ఆవారా’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.6.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.7.47 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్లకు రూ.70 లక్షల వరకు ఈ చిత్రం మిగిల్చిందని చెప్పొచ్చు.