Ayesha Kaduskar: రామ్ చరణ్ చెల్లెలుగా నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా?..

సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి గుర్తింపు తెచ్చుకుని తర్వాత హీరోయిన్లుగా డెవలప్ అయిన వాళ్లు, స్టార్ హీరోయిన్లుగా స్టార్ డమ్ తెచ్చుకున్నవాళ్లు చాలా మందే ఉన్నారు. అతిలోక సుందరి శ్రీదేవి మొదలుకుని, తులసి, రాశి వరకు.. అలాగే సుహాని (మనసంతా నువ్వే ఫేమ్), శ్రియా శర్మ (జై చిరంజీవ) ఇలా లిస్ట్ పెద్దదే. ఇప్పుడు హీరోయిన్‌గా సినిమాలు చెయ్యని ఓ చైల్డ్ ఆర్టిస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మొబైల్ రూపంలో ప్రపంచం మన చేతుల్లోనే ఉంది కాబట్టి కనిపెట్టడం పెద్ద కష్టమేమీ కాదు కదా.. ఇంతకీ ఆర్టిస్ట్ ఎవరంటే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కాంబినేషన్‌లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘గోవిందుడు అందరివాడేలే’ మూవీలో చరణ్ చెల్లెలిగా నటించిన అయేషా కదుస్కర్.. ఈ అమ్మాయి ఇప్పుడు చాలా పెద్దదైపోయింది. ఇప్పటివరకు కథానాయికగా సినిమాలు అయితే చెయ్యలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటుంది.

ట్రెండీ అండ్ స్టైలిష్ పిక్స్ షేర్ చేస్తుంటుంది. అయేషా ఫొటోలు చూసినవాళ్లు.. ‘సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఎప్పుడు?’ అని అడుగుతున్నారు కానీ అమ్మడు ఆన్సర్ ఇవ్వట్లేదు.అయేషా కదుస్కర్.. చరణ్ సినిమా కంటే ముందు కొన్ని బాలీవుడ్ సీరియల్స్‌లో యాక్ట్ చేసింది. హృతిక్ రోషన్ నటించిన ‘అగ్నిపథ్’ లో కూడా కనిపించింది. అప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ అయిన అయేషా పోస్ట్ చేసే ఇమేజెస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus