బాహుబలి కంక్లూజన్ 100 డేస్ కలక్షన్స్

  • August 5, 2017 / 11:18 AM IST

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి వెండితెరపై  చెక్కిన శిల్పం బాహుబలి కంక్లూజన్ ఏప్రిల్ 28 న ప్రపంచవ్యాప్తంగా 13,000 తెరలపై విడుదలై సంచలనం సృష్టించింది. నాలుగు భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ తొలిరోజు దేశవ్యాప్తంగా 125 కోట్ల గ్రాస్ రాబట్టి ఔరా అనిపించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజుకో రికార్డు చొప్పున బద్దలు కొడుతోంది. నిన్నటితో ఈ మూవీ శతదినోత్సవం పూర్తి చేసుకుని మరే భారతీయ చిత్రానికి సాధ్యం కాని ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది. 50 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1,708 కోట్లను వసూలు చేసిన బాహుబలి వంద రోజుల్లో 1915 కోట్లు రాబట్టి తెలుగు వారి సత్తాని చాటింది.

దీంతో చిత్ర బృందం ఆనందంలో ఉంది. నిర్మాత శోభు యార్గగడ్డ మాత్రం మరింత ఉత్సాహంతో బహుబలి కంక్లూజన్ ని  చైనాలో రిలీజ్ చేసే పనులను వేగవంతం చేస్తున్నారు. అక్కడి తొలి రోజు కలక్షన్స్ తో 2000 కోట్ల మెయిలు రాయిని దాటుతుందని  ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. 2000 కోట్ల క్లబ్ లో చేరిన తొలి తెలుగు చిత్రంగా బాహుబలి చరిత్ర లిఖించనుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus