తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి కంక్లూజన్ 22 డేస్ కలక్షన్స్!

బాహుబలి కంక్లూజన్ విడుదలై మూడు వారాలు పూర్తి అయినప్పటికీ థియేటర్ల వద్ద అదే సందడి కొనసాగుతోంది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సృష్టించిన ప్రపంచాన్ని చూసేందుకు మళ్లీ మళ్లీ వస్తున్నారు. అందుకే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1500 కోట్ల మైలు రాయిని దాటుకొని పరుగులు తీస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్, రానా నటనను చూసేందుకు చిన్న పెద్దా అని తేడా లేకుండా అందరూ క్యూ కడుతున్నారు. గత శనివారం (మే 20 ) నాటికీ రెండు రాష్ట్రాల్లో 179.45 కోట్ల షేర్ వసూల్ చేసింది. అతి త్వరలోనే 200 కోట్ల మార్క్ కి చేరుకోనుంది. ఏరియాల వారీగా వసూళ్ల వివరాలు…

నైజాం : 60.19 కోట్లు
సీడెడ్ : 31.27 కోట్లు
ఉత్తరాంధ్ర : 23.59 కోట్లు
ఈస్ట్ : 15.77 కోట్లు
వెస్ట్ : 11.48 కోట్లు
క్రిష్ణా : 12.77 కోట్లు
గుంటూరు : 16.32కోట్లు
నెల్లూరు : 6.96 కోట్లు
మొత్తం : 179.45 కోట్లు


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus