ఒక భాషలో నిర్మితమైన మూవీ మరొక భాషలోనూ విజయం సాధించడం సహజమే. కానీ మాతృకలో కంటే అనువాదంలోనే మరింత కలక్షన్స్ సాధించడం బాహుబలి కంక్లూజన్ కి మాత్రమే సాధ్యమైంది. తెలుగు భాషలో తెరకెక్కిన ఈ మూవీ తమిళం, హిందీ, ఇంగ్లిష్ భాషలో డబ్ అయి దేశవ్యాప్తంగా తొమ్మిదివేల థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలుపుకొని 1250 కోట్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో 160 కోట్లు కలెక్ట్ చేసిన బాహుబలి పార్ట్ 2 హిందీ వెర్షన్ రెండు వారాలకు 390.25 కోట్లు కొల్లగొట్టి ఔరా అనిపించింది.
అమీర్ ఖాన్ నటించిన దంగల్ అన్నిభాషల్లో 387.28 కోట్లు రాబట్టి అత్యధిక కలక్షన్ సాధించిన హిందీ సినిమాగా రికార్డ్ నమోదు చేసింది. ఆ రికార్డ్ ను బాహుబలి కంక్లూజన్ బద్దలు కొట్టింది. ఒక డబ్బింగ్ మూవీ బాలీవుడ్ సినిమా రికార్డ్ ను బీట్ చేయడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. లాంగ్ రన్ లో బాహుబలి 2 హిందీ పరిశ్రమకు భారీ టార్గెట్ ను ముందు ఉంచుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.