బాహుబలిని చూసి హీరోలు, డైరక్టర్లు వణికిపోతున్నారు!
- April 29, 2017 / 07:52 AM ISTByFilmy Focus
భారీ అంచనాలతో శుక్రవారం విడుదలైన బాహుబలి కంక్లూజన్ చూసి అభిమానులు ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు. తెలుగు చిత్రపరిశ్రమలోని ప్రముఖ డైరక్టర్లు రాజమౌళిని, ప్రభాస్ ని అభినందనలతో ముంచెత్తుతున్నారు. రామ్ గోపాల్ వర్మ కూడా రాజమౌళిని తనదైన శైలిలో ప్రశంసించాడు. ఆ ప్రశంస ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. “ప్రపంచ కాలాన్ని క్రీస్తు పూర్వం, క్రీస్తు శకంగా విభించినట్లు.. ఇప్పుడు భారతీయ సినిమాలను బిఫోర్ బాహుబలి(బీబీ), ఆఫ్టర్ బాహుబలిక(ఏబీ) అని పిలుస్తారు” అంటూ వర్మ ట్వీట్ చేశారు.
ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. మరింత ఉద్వేగంతో ‘ఖాన్లు, రోషన్లు, చోప్రాల కన్నా రాజమౌళి గొప్పవాడయ్యాడు. వజ్రం లాంటి రాజమౌళిని గుర్తించిన కరణ్‌జోహార్‌కు అభిమానులు పాదాభివందనం చేయాలి. కరణ్‌జోహార్‌కు సెల్యూట్ చేస్తున్నాను’ అంటూ పోస్టులు చేసి వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఇంకా బాలీవుడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్ల గురించి మాట్లాడుతూ ‘రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రాన్ని చూసి బాలీవుడ్‌లోని ప్రతి సూపర్ స్టార్, ప్రతి సూపర్ డైరెక్టర్ వణికిపోతున్నాడు’ అని తనదైన శైలిలో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్స్ పై బాలీవుడ్ స్టార్స్ ఏమని స్పందిస్తారో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















