ప్రపంచవ్యాప్తంగా సినీ జనాలు ఎదురు చూస్తున్న బాహుబలి కంక్లూజన్ ట్రైలర్ నేడు రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంటోంది. అభిమానుల అంచనాలకు మించి ట్రైలర్ ని కట్ చేయించి దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి శెభాష్ అనిపించుకుంటున్నారు. 2 .24 నిముషాల ఈ వీడియో ప్రభాస్ అభిమానులకు పండుగను తీసుకొచ్చింది. వారు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ట్రైలర్ లో అనేక విషయాలను డైరక్టర్ వివరించడానికి ప్రయత్నించారు. వాటిలో కొన్నింటిని మేము గమనించాము. సినిమాలో హైలెట్స్ గా నిలవనునున్న ఆ అంశాలపై ఫోకస్..
1 . తండ్రి కొడుకుల మధ్య తేడా గమనించారా ?తండ్రి కొడుకులు అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిని ఒక సీన్ లో చూసే అవకాశం లేదు. కానీ వారిద్దరిని అభిమానులు సులువుగా గుర్తించేలా డైరక్టర్ కొన్ని తేడాలను పెట్టారు. అమరేంద్ర బాహుబలి నుదుటున నెలవంక ఉంటుంది. మహేంద్ర బాహుబలి నుదుటిన లింగాన్ని చుట్టిన నాగేంద్రుడి బొట్టు ఉంటుంది.
2 . అందమైన దేవసేన రాజ్యందేవసేనగా అనుష్క అందంగా ఉండడమే కాదు, ఆమె కుంతల రాజ్యం కూడా సుందరంగా ఉంటుంది. ఎప్పుడూ జలజలా ప్రవహించే నది పక్కన ఏర్పాటైన ఈ రాజ్యంలో పచ్చని చెట్లు, పూలవనాలు, సెలయేర్లు, ఉన్నాయి. ట్రైలర్ లో కొన్ని క్షణాలు పాటు చూసేందుకే అద్భుతంగా ఉంటే వెండితెరపై ఇంకెలా ఉంటుందో..!!
3 . వెన్నుపోటు తర్వాత సంభాషణమనల్ని వెన్నుపోటు పొడిచిన వాడు మన ఎదురుగా ఉంటే, ఇంకా మనకి బతికదానికి కొన్ని క్షణాలు ఉంటే తప్పకుండా పొడిచిన వాడి అంతు చూస్తాం. కానీ బాహుబలి అలా చేయలేదు. తనని వెన్ను పోటు పొడిచిన కట్టప్పతో ఆత్మీయంగా మాట్లాడే సీన్ రుచి చూపించారు జక్కన్న. ” నువ్వు పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామ” అంటూ సెంటిమెంట్ డైలాగ్ తో సన్నివేశానికి బలం చేకూర్చారు.
4 . భల్లాల దేవా దున్నపోతుల మీద స్వారీబాహుబలి 1 లో భల్లాల దేవ అడవి దున్నను చంపే సీన్ అందరికీ గుర్తే. బాహుబలి 2 లో భల్లాల దేవ అడవి దున్నలనే తన రథానికి కట్టి రణరంగానికి వెళ్లారు. ఆ రధాన్ని చూసి ఎవరైనా తప్పుకోవలసిందే.
5 . రాజమాత శివగామి కంట కన్నీరుఅత్యంత ధైర్య వంతురాలు రాజమాత శివగామి కళ్ళల్లో భయం, కన్నీరు ఊహించలేము. కానీ బాహుబలి 2 లో ఆమెలో వాటిని చూపించబోతున్నారు. మొదటి భాగంలో మహేంద్ర బాహుబలిని ఒక చేత్తో పట్టుకొని ప్రాణ త్యాగం చేసిన శివగామి, అంతకు ముందు జరిగిన ఘట్టం ఒళ్ళు గగురుపొడిచేలా ఉంటుందని ట్రైలర్ చెప్పకనే చెబుతోంది.
6 . పోరులో ప్రేమకత్తులు మెడపైకి దూసుకొస్తున్న చూపుతిప్పుకోలేని అందగత్తె దేవసేన. భీకర పోరులో తనపైకి బాణాలు వస్తున్నా.. అమరేంద్ర బాహుబలి మాత్రం దేవసేనపై ప్రేమ బాణాలు విసిరారు. ఈ దృశ్యం చూసేందుకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక ఇద్దరూ ప్రేమలో పడిన తర్వాత రొమాన్స్ వర్ణించలేము.
7 . మహేంద్ర బాహుబలి – భల్లాలదేవ ఫైట్తండ్రిని చంపిన వ్యక్తిని, తల్లిని హింసించిన క్రూరుడిని ప్రాణం పోయిన వదలడు మహేంద్ర బాహుబలి. కొండను పిండి చేయగల భల్లాలదేవకి, కోపంతో రగిలిపోతున్న మహేంద్ర బాహుబలికి మధ్య జరిగే ఫైట్ ఒక్క క్షణం కూడా కంటి మీద రెప్ప వేయనీయదు.
8 . క్లైమాక్స్ లో అవంతికబాహుబలి కంక్లూజన్ క్లైమాక్స్ లో శివుడుతో పాటు అవంతిక, కట్టప్ప, కుంతల రాజ్య సైనికులు భల్లాల దేవా సైనికులతో తలపడే సన్నివేశాలు అలరించనున్నాయి. ఇందుకు అవంతిక కత్తి విన్యాసాలు మరో మారు ఆకట్టుకోనున్నాయి.