బాహుబలి -2 ఒరిజినల్ కథ ఇదే!

  • September 24, 2016 / 12:54 PM IST

తెలుగు వారితో పాటు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం బాహుబలి. ఈ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న బాహుబలి కంక్లూజన్ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ మూవీకి సంబంధించిన పూర్తి స్టోరీ లీక్ అయింది. ఆ కథను ఫిల్మీ ఫోకస్ రీడర్లకు ప్రత్యేకంగా అందిస్తున్నాం.

బాహుబలి బిగినింగ్ క్లైమాక్స్ లో కట్టప్ప అమరేంద్ర బాహుబలి ని వెన్నుపోటు పొడిచానని చెప్పటంతో సినిమా పూర్తి అవుతుంది. అక్కడ నుంచే బాహుబలి కంక్లూజన్ చిత్రం మొదలవుతుంది. కట్టప్ప జరిగిన కథను ఫ్లాష్ బ్యాక్ రూపంలో శివుడి(మహేంద్ర బాహుబలి)కి చెప్పడం మొదలు పెడతాడు. కాలకేయుడి మీద విజయం సాధించడానికి కారణమయిన అమరేంద్ర బాహుబలి మహిస్మతి రాజ్యానికి రాజు అవుతాడు. మరో వైపు కన్న కొడుకు భల్లాల దేవకి అన్యాయం జరిగిందని బిజ్జల దేవ కోపం తో రగిలి పోతుంటాడు.

అమరేంద్ర బాహుబలి పాలనలో మహిస్మతి రాజ్య ప్రజలు సంతోషంగా ఉంటారు. మహిస్మతి రాజ్యానికి దగ్గరలో ఉన్న కుంతల రాజ్యం మీద చిన్న రాజ్యాలు దండెత్తు వుంటాయి. కుంతల రాజ్యాన్ని తన తెలివి తేటలు, ధైర్య సాహసాలతో కాపాడుకుంటూ వస్తుంటుంది దేవసేన. అక్కడి ప్రజలకు ఆమె చెప్పిందే చట్టం. ఒకసారి దేవసేన ని అమరేంద్ర బాహుబలి చూడటం తో ప్రేమలో పడతాడు. అక్కడ నుండి వాళ్ల మధ్య ప్రేమ మొదలు అవుతుంది. ఆ విషయం తెలుసుకున్న భల్లాల దేవ కూడా దేవసేన పై మోజు పెంచుకుంటాడు.

కొడుకు ప్రేమ విషయం బిజ్జల దేవకి తెలుస్తుంది. అతను కుంతల రాజ్యానికి వర్తమానం పంపిస్తాడు. భల్లాల దేవని పెళ్లి చేసుకోనని దేవ సేన స్పష్టం చేస్తుంది. అవమాన భారంతో బిజ్జల దేవ శివగామి తో “నీ సొంత కొడుకు భల్లలా దేవ ని రాజు ని చేస్తావని ఆ రోజు అన్నావు, కానీ మాట తప్పావు. ఇప్పుడు మన కొడుకు కి ఇష్టమైన ఆ దేవసేన ని కూడా నువ్వు పెంచిన అమరేంద్ర బాహుబలి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఏమి చేస్తావు” అని ప్రశ్నిస్తాడు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక శివగామి ఆలోచనలో పడుతుంది.

కుంతల రాజ్యం నుండి విదేయుడు (సుబ్బరాజు ) వర్తమానాన్ని మహిస్మతి రాజ్యానికి తీసుకువస్తాడు. బిజ్జల దేవ పంపిన వర్త మానాన్ని కుంతల రాజ్యం దేవసేన తండ్రి తిరస్కరిస్తునట్టు విదేయుడు చెబుతాడు. ఆ సభలో భల్లాల దేవ కోపం తో విదేయుడు మీద దాడి చెయ్యటానికి దిగుతాడు. ఆ సమయం లో అమరేంద్ర బాహుబలి అడ్డు పడి విదేయుడిని కాపాడుతాడు. బిజ్జల దేవ ఆ సభ లో కొడుకు ప్రేమ సంగతిని లేవనెత్తుతాడు. శివగామి అక్కడ జరిగేదంతా చూస్తూ వుంటుంది. తాను ప్రేమిస్తున్న సంగతి నిజమేనని, దానిపై నిర్ణయం మాత్రం తల్లి శివగామి కి వదిలేస్తున్నానని అమరేంద్ర బాహుబలి అంటాడు. సభ లో అంతా శివగామి తీర్పు కోసం అందరూ ఎదురు చూస్తూ వుంటారు. రాజ్యం కావాలో ! ప్రేమ కావాలో ! తేల్చుకోమని అమరేంద్ర బాహుబలి కి శివగామి చెబుతుంది.

బాహుబలి చెప్పే సమాధానం కోసం అందరూ ఎదురుచూస్తుంటారు. అమరేంద్ర బాహుబలి ప్రేమ కావాలని కోరుకుంటాడు. బాహుబలి తీసుకున్న నిర్ణయానికి మహిస్మతి ప్రజలలో ఆందోళన మొదలవుతుంది. బాహుబలి రాజ్యం వదిలి వెళ్లవద్దని వారు వేడుకొంటారు. కానీ బాహుబలి మహిస్మతి ని వదిలి అరణ్య వాసం పడతాడు. ఆ విషయం తెలుసుకున్న దేవసేన బాహుబలికి తోడుగా వెళ్తుంది.

బాహుబలి, దేవసేన ని పెళ్లి చేసుకుని బౌద్ధమటంలో జీవనం కొనసాగిస్తూ ఉంటాడు. మహిస్మతి రాజ్యం అంతా భల్లాల దేవ (రానా) ఆధీనంలోకి వెళ్తుంది. మహిస్మతి రాజ్యం చేతిలో ఓడిపోయిన కాలకేయ తమ్ముడు నింజా (చరణ్ దీప్) పగతో రగిలిపోతుంటాడు. బాహుబలి రాజ్యం వదిలి వెళ్లిపోయాడని తెలుసుకున్న నింజా మహిస్మతి రాజ్యం మీద దాడి చెయ్యటానికి సిద్ధం అవుతాడు.

దేవ సేన తల్లి అయ్యిందని కుంతల రాజ్య ప్రజలకు శుభవార్త అందుతుంది. అదేసమయంలో కాలకేయ సైన్యం యుద్దానికి వచ్చినట్లు మహిస్మతి రాజ్య ప్రజలకు తెలుస్తుంది. ఆ యుద్ధంలో మహిస్మతి రాజ్యానికి భల్లాల దేవ రానా నాయకత్వం వహిస్తాడు. ఆ యుద్ధ రణరంగలో మొదటి రెండు దినాలు మహిస్మతి సైనికులు సగం మంది నింజా సైన్యం చేతిలో నేల కూలతారు. ఇంకో రెండు దినాల్లో మహిస్మతి రాజ్యం కుప్ప కూలిపోతుందని గ్రహించిన శివగామి బాహుబలి కి వర్తమానం పంపిస్తుంది.

వర్తమానం అందుకున్న బాహుబలి తిరిగి తన భార్య తో కలసి మహిస్మతి రాజ్యానికి వస్తాడు. కుంతల రాజ్యం, మహిస్మతి రాజ్యానికి సహాయం చేస్తుంది. బాహుబలి తిరిగి వస్తే తన కొడుకు ని రాజుగా తప్పిస్తారని బిజ్జల దేవ ఆందోళన చెందుతాడు. నింజా చేతిలో ఓడిపోతాం అనే భయం కంటే, తన అన్న తిరిగి వచ్చాడనే బాధ భల్లాల దేవలో ఎక్కువగా కనిపిస్తుంది.

మహిస్మతి రాజులకు నమ్మిన బంటు గా పనిచేసే కట్టప్పతో బాహుబలిని చంపమని భల్లాల దేవ, బిజ్జల దేవ ఆజ్ఞాపిస్తారు. బాధగా ఉన్నా రాజు మాటకు విలువ ఇచ్చి ఆ కార్యానికి సిద్ధమవుతాడు. నింజా సైన్యం తో భీకరంగా బాహుబలి యుద్ధం చేస్తుంటాడు. శత్రు సైన్యం దాదాపు కుప్పకూలుతుంది. ఆ సమయంలో కట్టప్ప బాహుబలిని వెన్ను పోటు పొడిచి చంపేస్తాడు.

యుద్ధంలో గెలిచినా బాహుబలి చనిపోవడంతో మహిస్మతి రాజ్య ప్రజలు శోక సంద్రంలో మునిగి పోతారు. శివగామి, దేవ సేనని తన వద్దే ఉంచుకుని సేవలు చేస్తుంది. ఆమెకు కొడుకు పుడతాడు. దీంతో భల్లాల దేవ బాహుబలి వారసుడి ని చంపాలని అనుకుంటాడు. కట్టప్ప ద్వారా భల్లాల దేవ కుట్ర శివగామి కి చేరుతుంది. అంతేకాదు బాహుబలి ని తన కొడుకు, భర్త కలసి చంపించారని తెలుసుకుని అప్పుడే పుట్టిన బిడ్డను తీసుకుని రహస్య మార్గం రాజ్యం నుంచి కిందికి వస్తుంది. బిడ్డని గాలిస్తూ సైనికులు వస్తారు. వారిని చంపి పారిపోవడానికి నదిని దాటే ప్రయత్నంలో అమరేంద్ర బాహుబలిని ఒంటి చేత్తో పట్టుకుని శివగామి ప్రాణాలు విడుస్తుంది. (ఈ సన్నివేశాన్ని బాహుబలి 1 లో మొదటనే చూస్తాం). ఇక అక్కడ నుంచి ఆ బిడ్డ శివుడుగా పెరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఇంతటితో ఫ్లాష్ బ్యాక్ పూర్తి అవుతుంది.

శివుడుగా పెరిగిన మహేంద్ర బాహుబలి, అమ్మ దేవసేన, కట్టప్ప, సైనికులతో ప్రత్యేక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. వీరికి కుంతల రాజ్యం అండగా నిలుస్తుంది. కొడుకు బద్రుడును చంపిన శివుడు మీద పగ తో భల్లాల దేవ రగిలిపోతుంటాడు. తన సైన్యం తో మహేంద్ర బాహుబలి పైకి యుద్దానికి వస్తాడు భల్లాల దేవ. అతనిని ఓడించి తల్లి దేవసేన కాళ్ల ముందు పడేస్తాడు మహేంద్ర బాహుబలి. ఆమె మహిస్మతి రాజ్యం లో అందరూ చూస్తుండగా భల్లాల దేవ ని చితి మీద పేర్చి సజీవ దహనం చేస్తుంది. ఆ బాధని తట్టుకోలేక బిజ్జల దేవ, తన కొడుకు చితిని చూస్తూ కన్ను ముస్తాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus