బాహుబలి కంక్లూజన్ కి భాష, ప్రాంతం అడ్డుకోవడం లేదు. విడుదలైన అన్ని చోట్ల కలక్షన్ల వర్షం కురుస్తోంది. గత నెల 28 న ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో 9,000 థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 125 కోట్ల గ్రాస్ రాబట్టింది. వారం రోజుల్లో 800 కోట్లు కొల్లగొట్టింది. కేవలం ఓవర్ సీస్ లో శుక్ర, శనివారాలతో కలిపి సుమారు 8.16 మిలియన్ డాలర్లనువసూలు చేసిన ఈ చిత్రం ఆదివారం నాటికి 10. 13 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. దీంతో మూడు రోజుల కలెక్షన్ల పరంగా ఓవర్సీస్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన బాహుబలి వారం రోజుల్లో 165 కోట్ల గ్రాస్ రాబట్టింది.
ఒక్క అమెరికాలోనే వందకోట్లు రాబట్టిందని సినీ విశ్లేషకుడు తరన్ అదుర్స్ ఈరోజు ట్వీట్ చేశారు. అక్కడ తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ వెర్షన్స్ లో సినిమా ప్రదర్శిస్తున్నారు. దీంతో ఈ భారీ కలక్షన్స్ సాధ్యమైందని ట్రేడ్ వర్గాల అంచనా వేస్తున్నారు. విదేశాల్లో బాహుబలికి వస్తున్న స్పందని చూసి చైనా, జపాన్ భాషల్లో రిలీజ్ చేయడానికి నిర్మాతలు శోభు, ప్రసాద్ లు సన్నాహాలు మొదలెట్టారు. త్వరలో చైనా, జపాన్ లోను బాహుబలి కంక్లూజన్ కలక్షన్ల సునామీ సృష్టించనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.