దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి కంక్లూజన్ ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో అత్యంత వైభవంగా జరిగింది. చిత్ర యూనిట్ తో పాటు తెలుగు. హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన పెద్దలు పాల్గొన్న ఈ ఫంక్షన్ లోని హైలెట్స్ ఇవే..
బాహుబలి 2 కోసం శ్రమించిన ప్రతి టెక్నీషియన్ గురించి పాట రూపంలో వివరించారు.
సినిమాకి షూటింగ్ మొత్తం పూర్తి అయిందని, విజువల్ ఎఫెక్ట్స్ పూర్తి అయితేనే బాహుబలి కంప్లీట్ అయినట్లు అని రాజమౌళి చెప్పారు.
ఒకే కథతో ఎన్ని సినిమాలు చేస్తారు అంటూ భారతీయ సినిమాలను హేళన చేసిన స్పీల్ బర్గ్ బాహుబలిని చూసి మాట్లాడమనండి అంటూ కృష్ణం రాజు సవాలు విసిరారు.
భారతీయ చిత్ర పరిశ్రమని బాహుబలి మరో సారి తల ఎత్తుకునేలా చేసిందని బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ వివరించారు.
రాజమౌళిని ఆశీర్వదిస్తూ కీరవాణి ఓ పాట పాడారు. అతను పాడుతుంటే రాజమౌళి కంటతడి పెట్టారు.
ఇప్పటికీ ఎప్పటికీ తన బెస్ట్ కో స్టార్ ప్రభాస్ అని రానా స్పష్టం చేశారు.
తెలుగు సినిమా స్థాయి పెరిగిందని చెప్పడానికి బాహుబలి నిదర్శనమని కెమెరామెన్ సెంథిల్ కుమార్ చెప్పారు.
బాహుబలి తెలుగు సినిమా కాదు, ఇండియన్ సినిమా అయిందని నటుడు సుబ్బురాజు అన్నారు.
సత్యరాజ్ కంటే కట్టప్పగానే తాను భారతదేశం మొత్తం తెలిసిందన్నారు సత్యరాజ్
తెలుగువారు తనను వాళ్ళ అమ్మాయిగా అక్కున చేర్చుకున్నారని తమన్నా చెప్పింది.
చాలా మంది హీరోల్లా ప్రభాస్ లో గర్వం లేదని కీరవాణి అభినందించారు.
“తప్పుచేసాడు అని తెలిసింది తల తెగింది” డైలాగ్ తో అభిమానులను ఉత్సాహపరిచి, థాంక్స్ చెప్పి కార్యక్రమాన్ని ప్రభాస్ ముగించారు.