దేశవ్యాప్తంగా 6500 థియేటర్లలో ఏప్రిల్ 28 న బాహుబలి కంక్లూజన్ సందడి చేయనుంది. విదేశాల్లో వేల తెరల్లో బాహుబలి హంగామా చేయనున్నాడు. రిలీజ్ కి ఇంకా 16 రోజులు సమయం మాత్రమే ఉండడంతో దర్శకధీరుడు రాజమౌళి సినిమాకి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేశారు. రెండు రోజుల్లో సెన్సార్ సభ్యుల ముందుకు చిత్రాన్ని తీసుకుపోతున్నారు. దీంతో ఈ మూవీ రన్ టైమ్ వివరాలు బయటికి వచ్చింది. బాహుబలి కంక్లూజన్ 170 నిముషాల నిడివి ఉందని తెలిసింది. అంటే రెండు గంటల 50 నిముషాలు. సాధారణంగా తెలుగు చిత్రాలు రెండుగంటల పది నిముషాల నుంచి రెండున్నర గంటల పాటు రన్ టైమ్ ఉంటుంది.
కానీ భారీ కథను ఇంట్రెస్టింగ్ గా చెప్పడానికి రాజమౌళి దాదాపు మూడు గంటల సమయం తీసుకున్నారు. రన్ టైమ్ ఎక్కువగా ఉన్నా ఒక్క క్షణం కూడా మిస్ కాకుండా సీట్ కి అతుక్కొని పోయి సినిమాని చూస్తారని చిత్రబృందం గట్టిగా నమ్ముతోంది. సినీ విశ్లేషకులు సైతం బాహుబలి 2 మరో విజువల్ వండర్ గా ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.