తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి కంక్లూజన్ 6 డేస్ కలక్షన్స్ (షేర్)

బాహుబలి కంక్లూజన్ సినిమా విడుదలై వారం రోజులు అవుతున్నా థియేటర్ల వద్ద సందడి మాత్రం తగ్గలేదు. రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా 9,000 తెరలపై విడుదలై అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 750 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనూ కలక్షన్ల జైత్రయాత్ర కొనసాగిస్తోంది. 5 రోజులకే 100 కోట్ల షేర్ ను దక్కించుకున్న ఈ చిత్రం 6వ రోజు కూడా అదే జోరును కొనసాగించింది. ఆరు రోజుల్లో 109 కోట్ల షేర్ వసూల్ చేసి ఔరా అనిపించింది. ఏరియాల వారీగా వసూళ్ల వివరాలు…

ఏరియా కలెక్షన్లు
నైజాం : 32.09 కోట్లు
సీడెడ్ : 19.05 కోట్లు
ఉత్తరాంధ్ర : 14.05 కోట్లు
ఈస్ట్ : 11.45 కోట్లు
వెస్ట్ : 9.01 కోట్లు
క్రిష్ణా : 7.87 కోట్లు
గుంటూరు : 11.44 కోట్లు
నెల్లూరు : 4.33 కోట్లు
మొత్తం : 109.29 కోట్లు


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus