ఈ దీపావళికి చక్రం తిప్పిన ప్రభాస్

  • November 5, 2016 / 06:56 AM IST

దీపావళి రోజు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చక్రం తిప్పారు. అమరేంద్ర బాహుబలిగా ప్రతాపాన్ని చూపించారు. గత ఏడాది బాహుబలి చిత్రం ద్వారా థియేటర్లలో కలక్షన్ల సునామీ సృష్టించిన డార్లింగ్ కొత్తగా చక్రం తిప్పడం ఏమిటని అనుకుంటున్నారా? ఇది సినిమా నెలకొల్పిన రికార్డు కాదు, బాహుబలి అనే పేరు బద్దలు కొట్టిన రికార్డు. బాహుబలి  పేరుతో ఆటంబాంబ్ ఈ దీపావళికి మార్కెట్ లోకి వచ్చింది. ఈ బాంబ్ చాలా వేగంగా అమ్ముడుపోయిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.

అమరేంద్ర బాహుబలి చిత్రం కలిగిన బాణాసంచాను కొనుగోలు చేయడానికి చిన్నారులు, యువత ఆసక్తికనబరిచారని వెల్లడించాయి. దీంతో ఈ సారి తెలుగు రాష్ట్రాల్లో విక్రయించిన మందు సామగ్రిలో ప్రభాస్ ఫోటో, బాహుబలి పేరున్నవి ఎక్కువ శాతం ఉన్నాయని వివరించాయి. ఇలా బాహుబలి దీపావళికి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ప్రభాస్ బాహుబలి కంక్లూజన్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 28 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

https://www.youtube.com/watch?v=wiO8kuGGNqk

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus