బాహుబలి రిలీజ్ అయి నేటికీ రెండేళ్లు
- July 10, 2017 / 08:12 AM ISTByFilmy Focus
తెలుగు చిత్రాలు సంవత్సరానికి వందకు పైగా రిలీజ్ అవుతుంటాయి. అందులో కొన్ని వచ్చినట్టు పోయినట్టు కూడా తెలియవు. కానీ కొన్ని మాత్రం చరిత్రను సృష్టిస్తాయి. మనల్ని తలెత్తుకొనేలా చేస్తాయి. ఎంతోమంది సినీ నటులకు, టెక్నీషియన్లను స్ఫూర్తిగా నిలుస్తాయి. అటువంటి జాబితాలో తాజాగా చేరిన చిత్రం బాహుబలి. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన కళాఖండం బాహుబలి ది బిగినింగ్ 2015 జులై 10 న థియేటర్లోకి వచ్చింది. చిన్న, పెద్ద, ఆడ, మెగా అని తేడా తెలియకుండా అందరికీ నచ్చింది. తెలుగు బాక్స్ ఆఫీస్ కి కలక్షన్ల సునామీ రుచి చూపించింది.
ప్రపంచవ్యాప్తంగా 650 కోట్లు గ్రాస్ వసూలు చేసి ఔరా అనిపించింది. దేశంలో అత్యధిక కలక్షన్స్ సాధించిన సినిమా జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ ట్వీట్ చేశారు. “బాహుబలికి రెండేళ్లు నిండాయి. మా కెరీర్లో పెద్ద పరీక్షను పాసైన క్షణం ఎప్పటికీ మరచిపోలేము.” అంటూ పోస్ట్ చేశారు. ఈ విజయాన్ని బాహుబలి టీమ్ తో పాటు తెలుగు సినీ ప్రేక్షుకులందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















