బాహుబలి తెలుగు సినీ పరిశ్రమని మాత్రమే కాదు.. భారతీయ సినీ ముఖ చిత్రాన్ని మార్చివేసేసింది. కథ నుంచి నిర్మాణ విలువలు, గ్రాఫిక్స్ హంగులు ఇలా అన్నింటికీ బాహుబలి బెంచ్ మార్క్ గా నిలిచింది. బాహుబలి కంక్లూజన్ తర్వాత ఆర్టిస్టుల, టెక్నీషియన్ల ఆలోచనలో మార్పు వచ్చింది. నిర్మాతలు కూడా తమ సినిమాల బడ్జెట్ ని పెంచారు. మెగాస్టార్ చిరంజీవి 151 వ సినిమాని వందకోట్ల లోపున నిర్మించాలని రామ్ చరణ్ తేజ్ అనుకున్నారు. ఇప్పుడు బడ్జెట్ ని 150 కి పెంచినట్లు తెలిసింది. బాలీవుడ్, హాలీవుడ్ నటీనటులను, టెక్నీషియన్లను సెలక్ట్ చేసుకుంటున్నారు.
ప్రభాస్ సాహో సినిమాకి కూడా తొలుత వందకోట్లు బడ్జెట్ వేశారు. బాహుబలి కంక్లూజన్ ఘనవిజయంతో సాహోబడ్జెట్ ని 150 – 200 కోట్లకు పెంచారు. ఈ జాబితాలో స్పైడర్ కూడా ఉంది. మహేష్ ద్విభాషా చిత్రం 80 కోట్లతో ప్రారంభమయింది. తర్వాత వందకోట్లకు చేరింది. బాహుబలి 2 లో అద్భుత గ్రాఫిక్స్, విజువల్ ఎఫక్ట్స్ చూసి తమ సినిమాలో అంతకు మించి విజువల్ ఎఫెక్ట్స్ ఉండాలని బడ్జెట్ మరో 20 కోట్లు పెంచారు. తెలుగు చిత్రాలు మాత్రమే కాదు తమిళంలో తెరకెక్కుతోన్న రోబో 2.0 బడ్జెట్ కూడా 350 నుంచి 500 కోట్లకు పెరిగింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.