రాజమౌళి ఇంకా రంగంలోకి దిగలేదు..!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ఎన్టీఆర్, చరణ్ వంటి ఇద్దరు స్టార్ హీరోలతో చేస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 2020 జూలై 30 న ఈ చిత్రం విడుదల కాబోతుందని నిర్మాత డీవీవీ దానయ్య ఓ ప్రెస్ మీట్ పెట్టి మరీ అనౌన్స్ చేసాడు. ఇక స్టోరీ లైన్ కూడా రాజమౌళి చెప్పేసాడు. కొమరం భీం, అల్లూరి సీతారామ రాజు వంటి ఇద్దరు చరిత్ర సృష్టించిన వీరుల జీవితాల్లో కొన్ని కల్పిత సంగటల్ని జోడించి ‘ఆర్.ఆర్.ఆర్’ ను రూపొందిస్తున్నట్టు తెలిపాడు.

అయితే రాజమౌళి ఇంత చేసినా.. ‘బాహుబలి’ కి వచ్చిన బజ్ ‘ఆర్.ఆర్.ఆర్’ కు రావట్లేదని కొందరు ఫిలిం విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఒక్క తెలుగు, హిందీ పక్కన పెడితే తమిళ, మలయాళం, కన్నడ వంటి భాషల్లో ‘ఆర్.ఆర్.ఆర్’ గురించి అక్కడి సినీ విశ్లేషకులు సైతం మాట్లాడుకోకపోవడం గమనార్హం. అదే ‘బాహుబలి’ మొదలైనప్పుడు పరిస్థితి ఇలా లేదు.. దేశమంతా ఆ సినిమా గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. దీంతో ఆ చిత్రం అద్భుతాల్ని క్రియేట్ చేయడం జరిగింది. అయితే రాజమౌళి ఇంకా అటువైపు ఫోకస్ పెట్టలేదా? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మరి జక్కన్న స్కెచ్ ఏంటనేది తెలియాల్సి ఉంది.

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus