Rajamouli, Kalki: రిలీజ్‌ డేట్‌ అడిగిన రాజమౌళికే కౌంటర్… నెటిజన్లు కాదు సుమా!

‘కల్కి 2898 ఏడీ’… ఈ సినిమా గురించి రాజమౌళి ఇటీవల ఓ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. సినిమా టీమ్‌ను, సినిమా గ్లింప్స్‌ను మెచ్చుకుంటూ ఇంట్రెస్టింగ్‌ కామెంట్లు చేశారు. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌లో ఉన్నారు. అయితే అదే ట్వీట్‌లో ఆఖరున ఓ ప్రశ్న కూడా అడిగారు. ఆ ప్రశ్న ఆయనొక్కరిదే కాదు.. మొత్తం సినిమా లోకానికిది అని చెప్పొచ్చు. అదే ‘కల్కి..’ ఎప్పుడు రిలీజ్‌ అవుతుంది అని. తొలుత ఈ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తారని చెప్పినా.. ఇప్పుడు 2024 అని చెప్పారు తప్ప డేట్‌ ఇవ్వేలేదు.

అయితే ఈ ప్రశ్న అడిగిన జక్కన్నకు భలే స్వీట్‌ షాక్‌ తగిలింది. ప్ర‌భాస్ ఫ‌స్ట్ లుక్ చూసి చిత్ర బృందంపై విమ‌ర్శ‌లు గుప్పించిన నెటిజ‌న్లు.. గ్లింప్స్‌ చూసి హాలీవుడ్‌ సినిమా రేంజిలో ఉందని పొగిడేస్తున్నారు. సెలబ్రిటీలు కూడా ఇందులో ఉన్నారు. రాజమౌళి కూడా ఇలానే చెప్పారు. అయితే రిలీజ్‌ డేట్ ఎప్పుడు అని ఓ ప్రశ్న వేశారు. ఈ ప్ర‌శ్నే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో మంచి వినోదానికి తెర తీసింది. రాజమౌళికి  (Rajamouli) దగ్గరవాళ్ల నుండే కౌంటర్లు ఎదురవుతున్నాయి.

‘బాహబలి’ సినిమా టీమ్‌ నుండే ఈ కౌంటర్లు వస్తుండటం గమనార్హం. ఎందుకంటారా వాళ్లకు తెలిసినంతగా జక్కన్న గురించి ఎవరికీ తెలియదుగా. ఆ మాటకొస్తే… వాళ్ల రెయిజ్‌ చేసిన విషయం చాలామందికి తెలుసు కూడా. అన్నీ చెబుతున్నారు అసలు ఏమన్నారో చెప్పడం లేదు అని అనుకుంటున్నారా? వస్తున్నాం వస్తున్నాం అదే పాయింట్‌కి వస్తున్నాం. ‘కల్కి’ గురించి రాజమౌళి చేసిన ట్వీట్‌పై ‘బాహుబ‌లి’ నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ‌ స‌ర‌దాగా స్పందించారు. ‘రిలీజ్ డేట్ గురించి అడుగుతున్న‌ది ఎవ‌రో చూశారా’ అని రాసుకొచ్చారు ఆయన.

దీనికి కార్తికేయ న‌వ్వుల ఎమోజీలు పెట్టాడు. ఎందుకో మీకు కూడా అర్థమైపోయుంటుంది. రాజ‌మౌళి సినిమాల రిలీజ్ డేట్ల విష‌యంలో ఎప్పుడూ క్లారిటీ ఉండ‌దు కదా. చెప్పిన డేట్‌కు క‌ట్టుబ‌డ‌టం రాజ‌మౌళికి చాలా సినిమాల విషయంలో ఇలానే జరిగింది. ‘ఈగ‌’, ‘బాహుబ‌లి 1’, ‘బాహుబ‌లి 2’, ‘ఆర్ఆర్ఆర్’ ఇలా ప్ర‌తి సినిమా డేట్ మార్చుకున్న‌దే. వాయిదాల మీద వాయిదాలు పడిన సినిమాలే. ‘ఆర్ఆర్ఆర్’ అయితే ఎన్నిసార్లు వాయిదా పడిందో లెక్కేలేదు.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus