ఏప్రిల్ 28 ‘బాహుబలి: ది కంక్లూజన్‌’ విడుదల

ఒక కథను సగం మాత్రమే చెప్పి.. మిగిలిన సగం పై ఆసక్తి కలిగించడం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళికే చెల్లింది. ఆయన సృష్టించిన వెండి తెర కళాఖండం బాహుబలి-బిగినింగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. మాహిష్మతి రాజ్యంలో జరిగిన విషయాలను తెలుసుకోవడానికి సినీ అభిమానులు ఆశపడుతున్నారు. బాహుబలిని కట్టప్ప ఎందుకు వెన్నుపోటు పొడిచాడు అనే ప్రశ్నకు జవాబు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ప్రశ్నకు సమాధానం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న తెలుస్తుందని అనుకున్నా ..  ఆ సస్పెన్స్ రివీల్ అవ్వడానికి మరికొంత సమయం పెరిగింది. ముందుగా రాజమౌళి చెప్పిన తేదీన సినిమా విడుదల కావడంలేదు. ‘బాహుబలి- కంక్లూజన్’ని ఏప్రిల్‌ 14న కాకుండా ఏప్రిల్‌ 28న విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించుకొంది.

ఈ విషయాన్ని ‘బాహుబలి’ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో వెల్లడించింది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో  ‘బాహుబలి- కంక్లూజన్’ క్లైమాక్స్ షూట్ చేస్తున్నారు. ఇందులో ప్రభాస్, రానా, తమన్నా, 5 వేల మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. నెల రోజుల క్రితం  నుంచి సాగుతున్న చిత్రీకరణ మరో నెల రోజుల పాటు సాగుతుంది. దీంతో ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అవుతుంది. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో రాజమౌళి టీమ్ నిమగ్నం కానుంది. బాహుబలి తొలి పార్ట్ కంటే రెండో భాగం మరింత బాగా ఉండాలని శ్రమిస్తున్నారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి విడుదల చేయాలని నిర్మాతలు శోభు యార్ల గడ్డ, ప్రసాద్ దేవి నేని ప్లాన్ చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus