అంచనాలను అందుకోలేని…బాహుబలి2!!!

  • October 24, 2016 / 07:19 AM IST

టాలీవుడ్ లో రాజమౌళి టైమ్ నడుస్తుంది…ఆయన ఏం చేసిన కలసి వస్తుంది….అసలు జక్కన్న పేరు వింటేనే….టాలీవుడ్ మురిసిపోతుంది….ఇది ఇప్పుడు రాజమౌళి పరిస్థితి. ఇదిలా ఉంటే జక్కన్న తాజాగా తీస్తున్న బాహుబలితో టాలీవుడ్ ను ప్రపంచానికి పరిచయం చేశాడు అనే చెప్పాలి. బాహుబలి1 భారీ విజయాన్ని సాధించడంతో ఈ సినిమా సెకెండ్ పార్ట్…అదే బాహుబలి2పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే అదే క్రమంలో తాజాగా ప్రభాస్ పుట్టిన రోజు సంధర్భంగా బాహుబలి2 మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు…భారీ అంచనాల మధ్య విడుదలయిన ఆ పోస్టర్ పెద్దగా ఆకట్టుకొకపోగా చాలా రొటీన్ గా ఉంది అన్న టాక్ వినిపిస్తుంది…మహేంద్ర బాహుబలి వస్తున్నాడహో అని ట్వీట్ పెట్టి ప్రభాస్ బాహుబలి2 పోస్టర్ వదిలారు.

సిక్స్ ప్యాక్ లో అదరగొడతున్న ప్రభాస్ ఈ పోస్టర్ లో కనిపిస్తాడు. చాల్ రఫ్ లుక్ లో ఉన్న ప్రభాస్ ను చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే….కాకపోతే…బాహుబలి టైమ్ లో.. శివలింగం భుజాన పెట్టుకున్న శివుడి ఫస్ట్ లుక్ తో పోలిస్తే ఈ లుక్ పెద్దగా ఆకట్టుకునేలా లేదు అన్న విమర్శలు బలంగా వినిపిస్తుంది. అంతేకాదు  గ్రాఫిక్స్ పై మరీ ఎక్కువ డిపెండ్ అయిపోయి.. ప్రభాస్ బాడీని కూడా ఫైన్ ట్యూన్ చేశారంటున్నారు. చేతిలో కత్తి.. ఇనప చైన్లతో ఉన్న పోస్టర్ ని చూస్తే.. మాస్ హీరో లుక్ లా ఉంది తప్ప.. బాహుబలిపై ఉన్న అంచనాలకు తగ్గట్లుగా లేదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అదే క్రమంలో ఎంత గ్రాఫిక్స్ అయితే మాత్రం….రాజుల కాలంలో సిక్ ప్యాక్ ఏంటి అన్న విమర్శలు కూడా బలంగా వినిపిస్తూ ఉన్నాయి….మరి వీటన్నింటికీ మన రాజమౌళి తన సినిమాతో సమాధానం చెప్తాడేమొ చూద్దాం….

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus