ఏప్రిల్ 28 కంటే ముందే రిలీజ్ కి సిద్ధమవుతున్న బాహుబలి కంక్లూజన్
- November 25, 2016 / 07:03 AM ISTByFilmy Focus
ఇదివరకు ఏ చిత్రం కోసం ఎదురుచూడనంతగా ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు బాహుబలి కంక్లూజన్ కోసం వెయిట్ చేస్తున్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి బాహుబలి బిగినింగ్ ని మంచి ట్విస్ట్ తో ముగించారు. కట్టప్ప అమరేంద్ర బాహుబలి ని ఎందుకు వెన్నుపోటు పొడిచాడు?.. అనే ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలని అందరూ ఆరాట పడుతున్నారు. అభిమానుల ప్రశ్నకు జవాబు చెప్పడంతో పాటు, మొదటి భాగం కంటే రెండో భాగం మరింత ఆకట్టుకునేలా జక్కన్న సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్యాచ్ వర్క్ లు మినహా షూటింగ్ మొత్తం పూర్తి అయిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుపుకుంటోంది.
ముందుగా ప్రకటించినట్లుగా వచ్చే ఏడాది ఏప్రిల్ 28 న విడుదల చేయాలని పక్కా ప్లాన్ సిద్ధం చేశారు. వీరందరికీ కృష్ణ అనే వీఎఫ్ఎక్స్ టెక్నీషన్ మూవీలోని కొంతభాగాన్ని లీక్ చేసి షాక్ ఇచ్చాడు. దీంతో చిత్ర బృందం ఉలిక్కిపడింది. మరో ఐదు నెలల పాటు చిత్రం లీక్ కాకుండా ఎలా కాపాడాలో ఆలోచనలో పడింది. చివరికి ఓ నిర్ణయానికి వచ్చింది. సాధ్యమైనంత త్వరగా చిత్రాన్ని విడుదల చేయాలనీ భావించింది. ఆ దిశగా రాజమౌళి టీమ్ అడుగులు వేస్తోంది. అన్ని పనులు పూర్తి అయిన వెంటనే చిత్రం థియేటర్లలోకి రానుంది. కొన్ని రోజులు ముందుగానా?, మార్చిలోనే వస్తుందా అనేది ఇంకా క్లారిటీ రాలేదు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















