ప్రపంచమంతా ఎదురుచూస్తున్న బాహుబలి కంక్లూజన్ పాటలు యూట్యూబ్లో విడుదలయ్యి విశేషంగా ఆకట్టుకుంటోంది. మరకతమని కీరవాణి స్వరపరిచిన పాటలు, బాహుబలి అభిమానులను, సంగీత ప్రియులను అలరిస్తున్నాయి. పంజాబీ గాయకుడు దలర్ మెహింది పాడిన సాహోరే బాహుబలి , కాల భైరవ ఆలపించిన దండాలయ్యా, ఒక ప్రాణం పాటలు మనసుకు హత్తుకుంటున్నాయి. ఇక ఈ చిత్రంలోని డైలాగులు కూడా ప్రతిఒక్కరి నోటా వినిపిస్తున్నాయి. ఏంటి సినిమా రిలీజ్ కాకముందే డైలాగులు పాపులర్ కావడమా? అవును నిజమే.. ముఖ్యంగా ప్రీ రిలీజ్ వేడుకలో వేదికపై ప్రభాస్ చెప్పిన “తప్పుచేసాడు అని తెలిసింది తల తెగింది” అనే డైలాగ్ డార్లింగ్ ఫ్యాన్స్ కి తెగ నచ్చింది.
వాటితో పాటు ట్రైలర్ లో చెప్పిన.. . ‘‘నువ్వు నా పక్కనుండేంత వరకూ నన్ను చంపే మగాడు ఇంత వరకూ పుట్టలేదు మామా’’ అనే డైలాగ్ బాహుబలి బిగినింగ్ లో “నేనెవర్ని” అనే డైలాగ్ మాదిరిగా దూసుకెళ్లింది. సినిమాలో అమరేంద్ర బాహుబలి సింహాసనంపై కూర్చునేటప్పుడు చెప్పే ‘‘అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మాహీష్మతీ ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’’ అనే డైలాగ్ కూడా పాపులర్ అయింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.