Babloo Prithiveeraj: ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ సక్సెస్ మీట్లో.. బబ్లూ పృథ్వీరాజ్ ఎమోషనల్ కామెంట్స్..!

క్యారెక్టర్ ఆర్టిస్టుల కష్టాలు చాలా మంది తెలీవు. సినిమాల్లో వాళ్లకు మంచి పాత్రలు దొరికినా.. ఫైనల్ కాపీలో వాళ్ళ పాత్ర ఉంటుందో లేదో చెప్పడం కష్టం. ‘సమ్మోహనం’ సినిమాలో నరేష్ పాత్రతో ఇలాంటి టాపిక్ ను దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ చూపించారు కూడా..! సీనియర్ నటుడు బబ్లూ పృథ్వీరాజ్ కి (Babloo Prithiveeraj) కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైందట. ఒకప్పుడు హీరోగా పలు తెలుగు సినిమాల్లో నటించిన ఇతను తర్వాత టాలీవుడ్ కి దూరమయ్యాడు. తర్వాత ‘యానిమల్’ తో (Animal) మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు.

Babloo Prithiveeraj

ఇప్పుడు ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi) సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ జరిగింది. ఇందులో అతను చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. బబ్లూ పృథ్వీరాజ్ (Babloo Prithiveeraj) మాట్లాడుతూ…. ” ‘యానిమల్’ ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) ‘తండేల్’ (Thandel) ‘జాట్’ (Jaat) అన్ని సూపర్ హిట్ సినిమాలు. యానిమల్ సినిమాలో నావి 4,5 సీన్లు ఎడిటింగ్లో పోయాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ లో కూడా కొన్ని సీన్లు డిలీట్ అయ్యాయి.

‘జాట్’ లో కూడా నేను చేసిన కొన్ని ముఖ్యమైన సీన్స్ పోయాయి. ‘తండేల్’ కూడా అంతే. కానీ ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ సినిమాలో మాత్రం నేను చేసిన ప్రతి సీన్, ప్రతి షాట్స్ ఉన్నాయి. ఆర్టిస్ట్ కి అది ఎంత ముఖ్యమో తెలుసా అండి. ఆ హ్యాపినెస్ కి కారణం హీరో కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram)  . ఎందుకంటే.. ‘యానిమల్’ తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ ఛాన్స్ ఇది. కో- డైరెక్టర్ సురేష్ గారు ఫోన్ చేసి ఇలాంటి సబ్జెక్ట్, ఇలాంటి క్యారెక్టర్ నేను చేయాలి అని చెప్పారు.

‘నేను ఇలాంటి క్యారెక్టర్ నాకు ఇస్తున్నారా?’ అని నాలో నేను షాక్ అయ్యాను. ఎందుకంటే ఏదో విలన్ లేదా అతని మనుషుల్లో ఉండే పాత్రేమో అనుకున్నాను. కానీ ఇలాంటి పాత్ర అని చెప్పేసరికి సర్ప్రైజ్ అయ్యాను. దీనికి బాగా యాక్టింగ్ చేయాలి అని అడిగాను, అందుకు పృథ్వీనే కావాలి అని హీరో కళ్యాణ్ రామ్ గారు చెప్పారట. కాబట్టి.. నేను కళ్యాణ్ రామ్ గారికి రుణపడి ఉంటాను” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.

వెంకీ లేకుండా దృశ్యం 3నా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus