దృశ్యం (Drishyam) అనే పేరే సస్పెన్స్, ఎమోషన్, ఫ్యామిలీ ఎలిమెంట్లకు మారుపేరుగా నిలిచింది. మోహన్ లాల్‌తో (Mohanlal) మలయాళంలో మొదలై, తమిళం, హిందీ, కన్నడ, తెలుగు భాషల్లో విజయం సాధించిన ఈ ఫ్రాంఛైజీకి విశేష ఆదరణ ఉంది. తెలుగులో విక్టరీ వెంకటేష్ (Venkatesh Daggubati) హీరోగా నటించిన రెండు భాగాలూ బ్లాక్‌బస్టర్స్ అయ్యాయి. “రాంబాబు” పాత్ర వెంకటేష్‌కి ఒక బిగ్గెస్ట్ హిట్ గా మారింది. ఇప్పుడు అదే సిరీస్‌లో మళయాళంలో మూడో భాగం రాబోతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
తాజా సమాచారం ప్రకారం, మలయాళ డైరెక్టర్ జీతూ జోసెఫ్ (Jeethu Joseph) మోహన్ లాల్‌తో కలిసి ‘దృశ్యం 3’ (Drishyam 3) పై స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఈసారి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేయాలన్న ఆలోచనతో మేకర్స్ ఉన్నారని టాక్. అంటే ఇతర భాషల్లో ప్రత్యేకంగా రీమేక్‌లు చేయకుండా, మలయాళ వెర్షన్‌ను డబ్ చేసి రిలీజ్ చేసే అవకాశం ఉందన్నమాట. ఈ ప్రకటనతో తెలుగు, హిందీ ప్రేక్షకుల్లో చర్చ మొదలైంది.
తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవగన్‌లకు (Ajay Devgn) ఉన్న మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుంటే, మోహన్ లాల్ డైరెక్ట్ వెర్షన్ అక్కడ ఎంత వరకు కమర్షియల్ హిట్ అవుతుందో అనే అనుమానం వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమా అంటే కంటెంట్‌తో పాటు, మార్కెట్ రీచ్ కూడా ఉండాలి. అయితే మలయాళ స్టార్ అయిన మోహన్ లాల్‌కు హిందీ, తెలుగు రాష్ట్రాల్లో ఫాలోయింగ్ పరిమితంగానే ఉంది.
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ‘దృశ్యం 3’ (Drishyam 3) మలయాళ వెర్షన్‌ను తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తే బిజినెస్ పరంగా 10 కోట్లే ఉండొచ్చని అంటున్నారు. అదే వెంకటేష్‌తో స్పెషల్ తెలుగు వెర్షన్ చేస్తే 50 కోట్ల వరకూ వెళ్తుందని విశ్లేషణ. ఆర్థికంగా చూస్తే మల్టీ వెర్షన్ ప్లాన్ మేకర్స్‌కి ఎక్కువ లాభాలు తెచ్చిపెడుతుంది. అందుకే ఇప్పటికైనా మేకర్స్ తగిన వ్యూహం వేయాల్సిన అవసరం ఉంది. ఒక్క మలయాళ వెర్షన్‌తో అందరికీ కనెక్ట్ అవుతుందనుకోవడం కాస్త రిస్క్. అభిమానులైతే… వెంకటేష్ లేకుండా తెలుగులో ‘దృశ్యం’ నడవదు అంటున్నారు. మరి మేకర్స్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.