“బాబు బంగారం”కు సీడెడ్ లో షాకింగ్ ఆఫర్!
- June 20, 2016 / 02:31 PM ISTByFilmy Focus
వెంకటేష్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “బాబు బంగారం”కు ప్రీ-రిలీజ్ బిజినెస్ భలే జోరుగా జరుగుతోంది. చాన్నాళ్ల తర్వాత వెంకటేష్ తన కామెడీ టైమింగ్ తో అదరగొడుతుండడం, “భలే భలే మగాడివో” లాంటి సూపర్ హిట్ అనంతరం మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడం వల్ల ఈ సినిమా సీడెడ్ రైట్స్ ఏకంగా నాలుగు కోట్ల రూపాయలు పలికినట్లు తెలుస్తోంది.
వెంకటేష్ కు అంతగా మార్కెట్ లేని సీడెడ్ కే నాలుగు కోట్ల ఆఫర్ వస్తే.. ఇక ఈస్ట్, వెస్ట్, నైజాంలో ఇంకెంత రాబడుతుందో చూడాలి. చూస్తుంటే నిర్మాతలకు విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ తెచ్చిపెట్టేలా ఉందీ చిత్రం!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

















