అల్లరి నరేష్ (Allari Naresh) లేటెస్ట్ మూవీ ‘బచ్చల మల్లి'(Bachhala Malli) ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘సోలో బ్రతుకే సో బెటర్’ (Solo Brathuke So Better) వంటి కమర్షియల్ హిట్ అందించిన సుబ్బు (Subbu Mangadevi) ఈ చిత్రానికి దర్శకుడు. ‘హాస్య మూవీస్’ బ్యానర్ పై రాజేష్ దండ (Rajesh Danda) నిర్మించారు. అయితే మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమాలో కొన్ని సన్నివేశాలు బాగున్నప్పటికీ ఎమోషనల్ గా ఆడియన్స్ కనెక్ట్ అవ్వకపోవడంతో నెగిటివ్ టాక్ వచ్చినట్టు స్పష్టమవుతుంది.
అయినప్పటికీ మొదటి రోజు ఓపెనింగ్స్ బెటర్ గానే వచ్చాయి. కానీ రెండో రోజు పడిపోయాయి. ఒకసారి (Bachhala Malli) 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం | 0.24 cr |
సీడెడ్ | 0.08 cr |
ఉత్తరాంధ్ర | 0.12 cr |
ఈస్ట్ | 0.04 cr |
వెస్ట్ | 0.03 cr |
గుంటూరు | 0.06 cr |
కృష్ణా | 0.09 cr |
నెల్లూరు | 0.03 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 0.69 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.10 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 0.79 cr (షేర్) |
‘ బచ్చల మల్లి’ సినిమాకు రూ.5.35 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.6 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజుల్లో ఈ సినిమా రూ.0.79 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.5.21 కోట్ల షేర్ ను రాబట్టాలి.