“బ్యాక్ డోర్” టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్!

“బ్యాక్ డోర్” టీజర్ చూస్తుంటే… ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందేమో అనిపిస్తోంది” అని టీజర్ రిలీజ్ వేడుకలో పాలుపంచుకున్న ప్రముఖ నిర్మాతలు కె.ఎస్.రామారావు, కె.ఎల్.దామోదర్ ప్రసాద్, రాజ్ కందుకూరి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సురేష్ కొండేటి, ప్రముఖ రచయిత-నిర్మాత కోన వెంకట్, ప్రముఖ నటుడు-నిర్మాత కె.అశోక్ కుమార్, ప్రముఖ దర్శకులు వీరశంకర్ తదితరులు అభిప్రాయపడడం తెలిసిందే. వారి అంచనాలు నిజం చేస్తూ… “బ్యాక్ డోర్” టీజర్ కి సోషల్ మీడియాలో ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. దాంతో బిజినెస్ పరంగానూ “బ్యాక్ డోర్” చిత్రానికి మెల్లగా క్రేజ్ ఏర్పడుతోంది.

టీజర్ రిలీజ్ అయిన 48 గంటల్లో మిలియన్ వ్యూస్ రాబట్టుకున్న ‘బ్యాక్ డోర్” టీజర్ ఇప్పుడు రెండు మిలియన్ వ్యూస్ కి చేరువలో ఉంది. ఇవన్నీ ‘ఆర్గానిక్’ వ్యూస్ కావడం విశేషం. తమ టీజర్ ను ఇంతగా ఆదరిస్తున్న నెటీజన్స్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్న “బ్యాక్ డోర్” చిత్ర బృందం… సినిమా కూడా అందరినీ అమితంగా ఆకట్టుకుంటుందని హామీ ఇస్తున్నారు. కాగా ఈ క్రేజీ చిత్రం ట్రైలర్ అతి త్వరలోనే ఓ ప్రముఖ యువ కథానాయకుడు చేతుల మీదుగా విడుదల కానుంది పూర్ణ ప్రధాన పాత్రలో ఆర్కిడ్ ఫిలిమ్స్ పతాకంపై కర్రి బాలాజీ దర్శకత్వం.. ‘సెవెన్ హిల్స్’ సతీష్ కుమార్ సమర్పణలో బి.శ్రీనివాస్ రెడ్డి ఈ క్రేజీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు!!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus