Balakrishna: బాలకృష్ణ అభిమానులకు బ్యాడ్‌న్యూస్‌

బాలకృష్ణ సినిమా థియేటర్లకు వచ్చి రెండేళ్లు దాటిపోయింది. అప్పుడెప్పుడో ‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’తో థియేటర్లలో సందడి చేశాడు బాలయ్య. ఆ తర్వాత మరో సినిమా ప్రారంభించడానికి చాలా సమయం పట్టింది. తీరా ‘అఖండ’మొదలెట్టారు అనేసరికి కరోనా మొదటి వేవ్‌ వచ్చి ఆగిపోయింది. పరిస్థితులు సద్దుమణిగి మళ్లీ చిత్రీకరణ ప్రారంభించారు. విడుదల తేదీ కూడా ప్రకటించేశారు. తీరా చూస్తే మళ్లీ కరోనా వచ్చి షూటింగ్‌ను ఆపేసింది. దీంతో ఇప్పట్లో సినిమా కష్టమే. అయితే బాలయ్య అభిమానులకు మరో షాకింగ్‌ న్యూస్‌.

‘అఖండ’ సినిమాను తొలుత మే 28న విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. అయితే కరోనా పరిస్థితుల దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు నడపలేని పరిస్థితి నెలకొంది. తెలంగాణలో థియేటర్లు మూసేయగా, ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన విధించారు. త్వరలో అక్కడ కూడా థియేటర్లు మూసేస్తారనే మాట వినిపిస్తోంది. కరోనా పరిస్థితులు చూస్తుంటే కనీసం నాలుగైదు నెలలు సినిమా థియేటర్లకు జనాలు థియేటర్లకు వచ్చే అవకాశం లేదంటున్నారు. దీంతో ఇప్పట్లో బాలయ్య సినిమా విడుదల లేనట్లే.

‘అఖంఢ’ తర్వాత బాలయ్య సినిమా ఇదీ అంటూ బలమైన సమాచారం లేనప్పటికీ మైత్రీ మూవీస్‌ నిర్మాణంలో గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో నటిస్తాడని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే గోపీచంద్‌ కథను సిద్ధం చేస్తున్నాడని అంటున్నారు. ప్రకాశం జిల్లా వేటపాలెం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని కూడా అంటున్నారు. అయితే ఈ సినిమాను జూన్ ఆఖరులో ప్రారంభించాలని ముందుగా అనుకున్నారట. కానీ కరోనా పరిస్థితుల కారణంగా ఈ సినిమా ముహూర్తం కూడా వాయిదా పడేలా ఉంది.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus