Mega Heroes: నిన్న ‘ఆచార్య’.. నేడు ‘బ్రో’.. మెగా ఫ్యామిలీకి ఆ సెంటిమెంట్ కలిసి రావడం లేదా?

ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలు కలిసి సినిమా చేస్తున్నారు అంటే ఆ సినిమాపై సహజంగానే భారీ అంచనాలు ఏర్పడతాయి. కానీ ఆ హీరోలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే కథలు డిజైన్ చేసుకుని… సినిమాలు చేస్తే ఫలితం దారుణంగా ఉంటుంది. కథ డిమాండ్ చేస్తే ఓకే. నందమూరి ఫ్యామిలీని తీసుకుంటే .. సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని హిట్ అయ్యాయి. అక్కినేని ఫ్యామిలీని తీసుకుంటే .. ఏఎన్నార్ – నాగార్జున కాంబినేషన్లో వచ్చిన ‘శ్రీరామదాసు’ మంచి సక్సెస్ అందుకుంది.

ఇక నాగార్జున – నాగ చైతన్య కాంబినేషన్లో రూపొందిన ‘మనం’ ‘బంగార్రాజు’ సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి.కృష్ణ – మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన కొడుకు దిద్దిన కాపురం కూడా మంచి సక్సెస్ అయ్యింది. అయితే మెగా ఫ్యామిలీకి మాత్రం ఇలాంటి సెంటిమెంట్ కలిసి రావడం లేదు. పాటల్లో డాన్స్ ల వరకు ఓకే కానీ.. మెగా ఫ్యామిలీకి (Mega Heroes) చెందిన ఇద్దరు హీరోలు కలిసి నటిస్తే .. సినిమా ప్లాప్ అవుతుంది.

పాటలో భాగంగా ‘మగధీర’ లో చిరు – చరణ్ లు కలిసి నటిస్తూ డాన్స్ చేశారు కాబట్టి, దర్శకుడు రాజమౌళికి ఇలాంటి నెగిటివ్ సెంటిమెంట్లు కూడా ఎఫెక్ట్ చూపించవు కాబట్టి ఆ సినిమా ఫలితం బాగానే వచ్చింది. కానీ ‘బ్రూస్ లీ’ ‘ఆచార్య’ సినిమాలు పెద్ద డిజాస్టర్లుగా మిగిలాయి. ఇక చిరు.. పవన్ కలిసి నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్’ కూడా పెద్ద ప్లాప్ అయ్యింది. తాజాగా రిలీజ్ అయిన ‘బ్రో’ ఫలితం కూడా ఇందుకు మినహాయింపు కాదేమో అనిపిస్తుంది.

ఈ సినిమాకి కూడా మిక్స్డ్ టాక్ వస్తుంది. మరోపక్క బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతాలు చేసే అవకాశం లేదు. దీంతో ‘మెగా ఫ్యామిలీ హీరోలకి ఇదొక బ్యాడ్ సెంటిమెంట్ ‘ అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. బహుశా ఈ సెంటిమెంట్ వల్లే చిరు కూడా బయట హీరోలతో(రవితేజ) సినిమాలు చేస్తున్నారు అని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.

బ్రో సినిమా రివ్యూ & రేటింగ్!

‘బ్రో’ మూవీ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు..!
‘బ్రో’ కి మిక్స్డ్ టాక్ రావడానికి కారణం ఈ 10 మైనస్సులేనట!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus