Adipurush: ట్రోలర్ల దాడికి.. టీజర్‌ బ్లాకింగ్‌ యాడ్‌ అయ్యిందిగా!

యూవీ క్రియేషన్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో ఓ వీడియోను బ్లాక్‌ చేశారు. ఇందులో విషయం ఏముంది అంటారా? ఆ బ్లాక్‌ అయ్యింది ‘ఆదిపురుష్‌’ టీజర్‌. ఇప్పుడు ఇంట్రెస్టింగే కదా. ఇది సోమవారం మధ్యాహ్నం జరిగింది. దీనిపై యూవీ క్రియేషన్స్‌ టీమ్‌ రియాక్ట్‌ అయ్యి సమస్యను ఫిక్స్‌ చేసుకున్నారు. కానీ అలా బ్లాకింగ్‌ ఎందుకు చేశారు అంటే. ఆ వీడియోలోని మ్యూజిక్‌ టీసిరీస్‌ వాళ్లది కాబట్టి చేశారట. వాళ్లు ఈ సినిమాకు నిర్మాతలే, యూవీ వాళ్లు నిర్మాతలే.

అంటే ఓ నిర్మాత యూట్యూబ్‌ ఛానల్‌లో వీడియోను, మరో నిర్మాత ఛానల్‌ వాళ్లు బ్లాక్‌ చేశారన్నమాట. ఒక యూట్యూబ్‌ ఛానల్‌కి చెందిన వీడియోనో, ఆడియోనో మరొకరు వాడుకుంటే.. వారి వీడియోను యూట్యూబ్‌లో బ్లాక్‌ చేస్తుంటారు. ఇది యూట్యూబ్‌ టీమ్‌ నుండి ఆటోమేటెడ్‌గా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఒక వీడియోను వేరే ఛానల్‌ వాళ్లు వాడుకోవాలి అంటే.. మాతృ ఛానల్‌ అనుమతి తీసుకోవాలి. లేకపోతే బ్లాక్‌ చేస్తారు. అలా చేయకూడదు అంటే యూట్యూబ్‌లో ఆ ఛానల్‌ను వైట్‌లిస్ట్‌ చేయాలి. అయితే ఈ పనిని యూవీ క్రియేషన్స్‌ చేయించుకోలేపోయింది.

ఇప్పుడు అర్థమైందిగా.. మేం ఏం చెప్పాలి అనుకున్నామో. మామూలుగా అయితే చిన్న చిన్న యూట్యూబ్‌ ఛానల్స్‌ ఇలా చేస్తే టీమ్‌ సరిగ్గా చూసుకోలేకపోయారు అనొచ్చు. కానీ యూవీ క్రియేషన్స్‌ లాంటి పెద్ద బ్యానర్‌కే ఇలా జరిగింది అంటే పెద్ద విషయమే కదా. సినిమా టీజర్‌ లాంచ్‌ విషయంలో సినిమా టీమ్‌ సరిగ్గా ఏర్పాట్లు చేయలేకపోయింది. దీంతో లైవ్‌ స్ట్రీమింగ్‌లు సరిగ్గా రాలేదు. అంత భారీగా చేసిన ఈవెంట్‌ను అభిమానులు లైవ్‌లో చూడలేకపోయారు.

అదొక సమస్య అంటే, సినిమా గ్రాఫిక్స్‌ విషయంలో సోషల్‌ మీడియాలో ట్రోలింగ్స్‌ మరో సమస్య. ఇప్పుడు ఈ బ్లాకింగ్‌ మరొకటి. టీసిరీస్‌ టీమ్‌ తర్వాత మాట్లాడి, సమస్యను ఫిక్స్‌ చేసుకున్నారు యూవీ క్రియేషనన్స్ వారు. కానీ ఆ పనేదో ముందే చేసుకుంటే పరువు పోకుండా ఉండేది కాదు. ఇంకా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్‌లు, వీడియోలు చాలానే వస్తాయి. మరి అప్పుడైనా జాగ్రత్తగా పడితే బాగుంటుంది. లేదంటే మళ్లీ పరువు పోతుంది.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus