టాలీవుడ్ హీరోల సినిమాలకు ఇలాంటి పరిస్థితా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో చాలామంది హీరోలు సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. అయితే స్టార్ హీరోలు రెండేళ్లకు, మూడేళ్లకు ఒక సినిమాలో నటిస్తుండటంపై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మరోవైపు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు ఫ్లాప్ అయితే భారీ మొత్తంలో నష్టాలు వస్తుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఎక్కువమంది హీరోలు పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాల షూటింగ్ లు వేర్వేరు కారణాల వల్ల అంతకంతకూ ఆలస్యమవుతూ ఉండటంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పటివరకు 50 శాతం షూటింగ్ ను కూడా పూర్తి చేసుకోలేదు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో ఈ సినిమా మేకర్స్ సైతం కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. మరో స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించనుండగా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది.

శంకర్ ఒకే సమయంలో రెండు సినిమాలను తెరకెక్కిస్తుండటంతో చరణ్ శంకర్ కాంబో మూవీ షూట్ నత్తనడకన సాగుతోంది. బన్నీ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ మూవీ షూట్ కూడా అంతకంతకూ ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూట్ కూడా వేగంగా జరగడం లేదు.

ఈ సినిమా గురించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వస్తూ ఈ సినిమాపై అంచనాలను అంతకంతకూ తగ్గిస్తున్నాయి. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలు సైతం చెప్పిన తేదీలకు విడుదల కావడం లేదు. టాలీవుడ్ స్టార్స్ కు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోందని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus