Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ లో ఎక్కువైన బూతులు..! ఎవరెవరు ఏం మాట్లాడారంటే.?

బిగ్ బాస్ హౌస్ లో బూతులు ఎక్కువ అయ్యాయి. ఈ సీజన్ లో అన్ని సీజన్స్ కంటే కూడా ఎక్కువ బూతులు వినిపిస్తున్నాయి. లాస్ట్ సీజన్ లో రేవంత్ ఎక్కువగా బూతులు మాట్లాడుతున్నావ్ అంటూ నాగార్జున రెండు మూడుసార్లు హెచ్చరించారు. ఇప్పుడు ఈ సీజన్ లో హద్దులు దాటి మారి బూతులు మాట్లాడుతున్నారు. అన్ని సీజన్స్ కంటే కూడా ఈ సీజన్ లో ఇవి ఎక్కువగా వినిపిస్తున్నాయని బిగ్ బాస్ ఆడియన్స్ మొత్తుకుంటున్నారు. అంతేకాదు, టెలికాస్ట్ లో కూడా బీప్స్ ఎక్కువగా వేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది.

అయితే, ఈసీజన్ లో 7వ వారం (Bigg Boss 7 Telugu) నామినేషన్స్ లో భోలే షవాలి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రియాంక – శోభా ఇద్దరూ కూడా భోలేపై విరుచుకుపడ్డారు. నామినేషన్స్ లో బరాబర్ ఇచ్చాడు ప్రశాంత్ మీకు అంటూనే బెహం** అనే మాట మాట్లాడాడు. దీంతో పక్కనే ఉన్న ప్రియాంక వెంటనే రియాక్ట్ అయ్యింది. నువ్వు ఆగమ్మా, మద్యలో వస్తున్నావ్ అంటూ చెప్పినా కూడా ప్రియాంక వినిపించుకోలేదు. నామినేషన్స్ ప్రోసెస్ ని ఆపేస్తానంటూ రెచ్చిపోయింది.

ఇక దీనిపై బిగ్ బాస్ ఆడియన్స్ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ఇన్ని వారాల్లో మరి వేరేవాళ్లు కూడా బూతులు మాట్లాడారు కదా, మరి అప్పుడు ప్రియాంక ఇలా రియాక్ట్ అవ్వలేదేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక్కసారి ఎవరెవరు ఏం మాట్లాడారు అనేది చూసినట్లయితే., రెండో వారంలో చూస్తే మాయాస్త్రం టాస్క్ లో అమర్ ని ప్రశాంత్ ఎలిమినేట్ చేశాడు. దీనికి అమర్ బాగా ఫ్రస్టేట్ అయిపోయాడు. బాత్రూమ్ లో వాడు రీజన్ లేకుండా నన్ను తీసేశాడు అని, వాడి వల్ల నా గేమ్ మ* గు** పోయిందని అన్నాడు. అప్పుడు ప్రియాంక వాష్ రూమ్ లోనే ఉంది.

ఏయ్ ఏయ్ నోరు జాగ్రత్త అన్నదే తప్ప ఇంతలా వ్యతిరేకించలేదు. అలాగే, మరోవారం టాస్క్ లో నాకు గు* మండుతోందంటూ గౌతమ్ రెచ్చిపోయి బూతులు మాట్లాడాడు. అప్పుడు కూడా ప్రియాంక వాళ్ల టీమ్ లోనే ఉంది. కానీ వ్యతిరేకించలేదు. ఇప్పుడు మాత్రం భోలే అన్న మాటని పట్టుకుని రచ్చ రచ్చ చేసింది. దీనికి శోభాశెట్టి కూడా ఫుల్ ఫైర్ అయిపోయింది. ప్రియాంక అయితే సిగ్గుండాలి.. తూ.. అంటూ రెండుసార్లు పక్కకి ఉమ్మింది. దీనికి భోలే గట్టిగా రియాక్ట్ అయ్యాడు. తూ.. అని నేను మరోసారి తిరిగి ఉమ్మితే నీ బ్రతుకు ఏం కావాలి అంటూ మాట్లాడాడు. అంతేకాదు, బిగ్ బాస్ అంటే ఇలా కొట్లాడాలి, అరవాలి అనుకుంటున్నావేమో..

అది కాదు నువ్వు మోనితలాగా ఆడకు. శోభాశెట్టిలాగా ఆడు అంటూ మాట్లాడాడు భోలే షవాలి. ఫైనల్ గా నామినేషన్స్ అయిపోయిన తర్వాత భోలే వచ్చి సారీ చెప్పాడు. ఆడియన్స్ కి, బిగ్ బాస్ కి, ప్రియాంకకి ఇంకా శోభాకి కూడా సారీ చెప్పాడు. చాలాసేపు ప్యాచ్ అప్ చేస్కోవడానికి ప్రయత్నించాడు. ఆవేశంలో ఉన్న ఇద్దరూ కూడా వినలేదు. ఆ తర్వాత నైట్ షేక్ హ్యాండ్స్ బలవతంగా ఇచ్చారు. మనస్పూర్తిగా అయితే భోలేని క్షమించలేదు. మరి ఈ గొడవ టాస్క్ లో కూడా కంటిన్యూ అవుతుందా.. లేదా మరో ఇష్యూకి దారితీస్తుందా అనేది చూడాలి

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus