Bahishkarana Review in Telugu: బహిష్కరణ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

  • July 19, 2024 / 01:24 PM IST

Cast & Crew

  • రవీంద్ర విజయ్ (Hero)
  • అంజలి (Heroine)
  • శ్రీతేజ్, అనన్య నాగళ్ళ, సమ్మెట గాంధీ తదితరులు (Cast)
  • ముఖేష్ ప్రజాపతి (Director)
  • ప్రశాంతి మలిశెట్టి (Producer)
  • సిద్దార్థ్ సదాశివుని (Music)
  • ప్రసన్న ఎస్ కుమార్ (Cinematography)
  • Release Date : జూలై 19, 2024

అంజలి (Anjali) ప్రధాన పాత్రలో రూపొందిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. టీజర్, ట్రైలర్స్ లో ఆమె యమ గ్లామరస్ గా కనిపించడంతో ఈ సిరీస్ పేరు ఎక్కువగా ట్రెండ్ అయ్యింది. ఈరోజు ‘జీ5’ కి 6 ఎపిసోడ్లుగా అందుబాటులోకి వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం రండి :

కథ : పెద్దపల్లి అనే ఓ గ్రామం.. దానికి ప్రెసిడెంట్ శివయ్య (రవీంద్ర విజయ్ (Ravindra Vijay ). అతని మాటను కాదని ఆ ఊర్లో ఏమీ జరగదు. ఆయన కోసం పెద్దపల్లి వస్తుంది పుష్ప (అంజలి) అనే ఓ వేశ్య. పుష్ప చాలా అందంగా ఉంటుంది. దీంతో శివయ్య ఆమెకు పడిపోతాడు. శాశ్వతంగా ఆమెను ఉంచుకోవాలి అనుకుంటాడు. అయితే పుష్ప అందం గురించి, శివయ్య ఆమెకు ఇచ్చే ప్రాముఖ్యత గురించి ఊరంతా మాట్లాడుకుంటూ ఉంటుంది. మరోపక్క శివయ్యకు కుడి భుజం అయిన దర్శి (శ్రీతేజ్) కి పుష్ప పడిపోతుంది.

దర్శి కూడా ఆమె ప్రేమను స్వాగతిస్తాడు.ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతారు. అందుకు శివయ్య అనుమతి కోరతారు. అతను కూడా అందుకు సరే అంటాడు. ఇక పెళ్లి షాపింగ్ కోసం పట్నం వెళ్లి వచ్చిన దర్శికి శివయ్య ఊహించని షాక్ ఇస్తాడు? అదేంటి? మధ్యలో లక్ష్మీ(అనన్య నాగళ్ళ (Ananya Nagalla) దర్శి జీవితంలోకి ఎలా ఎంట్రీ ఇచ్చింది. దర్శి ఎందుకు జైలుకు వెళ్ళాడు. పుష్ప జీవితం ఏమైంది? ఈ ప్రశ్నలకి సమాధానమే ‘బహిష్కరణ’ సిరీస్.

నటీనటుల పనితీరు : అంజలి మంచి నటి. ఇది ఎప్పుడో ప్రూవ్ అయ్యింది. కానీ ఇప్పుడు ఆమె కేవలం అవకాశాల కోసమే అన్నట్టు బోల్డ్ పాత్రలు చేస్తున్నట్లు అనిపిస్తుంది. మొన్నటికి మొన్న విశ్వక్ సేన్(Vishwak Sen)’గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari) లో కూడా ఆమె వేశ్య పాత్రలాంటిదే చేసింది. ఇప్పుడు ‘బహిష్కరణ’ లో కూడా అలాంటి పాత్రే చేసిందని చెప్పవచ్చు. అయితే తన మార్క్ నటన ఎక్కడా మిస్ కాలేదు.ఇంటిమేట్ సీన్స్ కూడా హద్దులు దాటి ఏమీ లేవు. ఆ పాత్రకు ఎంత అవసరమో అంతే ఉన్నాయి. క్లైమాక్స్ ఎపిసోడ్ లో కూడా అంజలి బాగా నటించింది. ప్రెసిడెంట్ పాత్రలో రవీంద్ర విజయ్ బెస్ట్ ఇచ్చాడు. అతని లుక్, డైలాగ్ డెలివరీ కూడా బాగున్నాయి.కానీ అతనికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు మనకి ‘రంగస్థలం’ (Rangasthalam) ‘రుద్రంగి’ సినిమాల్లో జగపతి బాబుని (Jagapathi Babu) గుర్తుచేస్తాయి.

శ్రీతేజ్ కూడా తన ప్రామిసింగ్ నటనతో మంచి మార్కులు వేయించుకున్నాడు. ఇతను అండర్ రేటెడ్ విలక్షణ నటుడు అని చెప్పాలి. ప్రతి సినిమాలో తన బెస్ట్ ఇస్తున్నాడు. కానీ ఎందుకో సరైన బ్రేక్ రావడం లేదు. ఇక అనన్య నాగళ్ల పాత్ర రెగ్యులర్ గానే అనిపించింది. సమ్మెట గాంధీ పాత్రలో కూడా పెద్దగా కొత్తదనం ఏమీ కనిపించలేదు. షణ్ముక్, చైతన్య సాగిరాజు, మహమ్మద్ బాషా పాత్రలు ఓకే ఓకే అన్నట్టు ఉన్నాయి. మిగిలిన పాత్రలు పెద్దగా గుర్తుండవు.

సాంకేతిక నిపుణుల పనితీరు : ‘రంగస్థలం’ తర్వాత రా అండ్ రస్టిక్ డ్రామాలు ఎక్కువయ్యాయి . ‘పుష్ప’ వరకు వాటి హవా నడిచింది. కానీ ఇప్పుడు వాటి హవా తక్కింది. థియేటర్లలో అలాంటి జోనర్లకి కాలం చెల్లింది. అందుకే అలాంటి జోనర్లో రూపొందిన ‘బహిష్కరణ’ ని వెబ్ సిరీస్ గా ఓటీటీకి తీసుకొచ్చారు. కథ పరంగా చూసుకుంటే ఇది కొత్తగా ఏమీ అనిపించదు. కానీ టేకింగ్ ఎంగేజ్ చేస్తుంది. కొన్ని సన్నివేశాలు అయితే క్యూరియాసిటీని క్రియేట్ చేస్తాయి.

దర్శకుడు ముఖేష్ ప్రజాపతి రా అండ్ రస్టిక్ ఫీల్ వచ్చేలా కొన్ని ఎపిసోడ్స్ ని తీర్చిద్దాడు. ఇందులో కూడా క్యాస్ట్, అంటరానితనం వంటి సున్నితమైన అంశాలు టచ్ చేశాడు. వాటి కోసం రాసుకున్న సన్నివేశాలు కొంచెం డిస్టర్బింగ్ గా ఉంటాయి. థియేటర్లలో సినిమాగా రిలీజ్ అయితే వివాదాల్లో నిలిచేది బహిష్కరణ. ఓటీటీ కాబట్టి పెద్దగా సీరియస్ గా తీసుకోరు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగ్గట్టు బాగానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అలానే ఉన్నాయి.

విశ్లేషణ : ‘బహిష్కరణ’ .. కొంచెం సెన్సిటివ్ కంటెంట్ తో రూపొందిన వెబ్ సిరీస్. మొదటి 3 ఎపిసోడ్లు స్లోగా ఉంటాయి. ఆ తర్వాత ఎపిసోడ్స్ పర్వాలేదు అనిపిస్తాయి. వీకెండ్ కి ఒకసారి ట్రై చేయొచ్చు.

రేటింగ్ : 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus