500 కోట్ల మార్క్ ని క్రాస్ చేసిన బాహుబలి కంక్లూజన్ ప్రీ రిలీజ్ బిజినెస్

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి అపూర్వ సృష్టి ‘బాహుబలి : బిగినింగ్’ సినిమా రిలీజ్ తర్వాత రికార్డులను నెలకొల్పగా… ఈ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న బాహుబలి కంక్లూజన్ విడుదలకు ముందే చరిత్రను లిఖిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ ఫస్ట్ కాపీ రాకముందే 500 కోట్ల బిజినెస్ చేసింది. నెల రోజుల ముందే 45 కోట్లు చెల్లించి అమెరికా థియేటర్ హక్కులను ఓ సంస్థ సొంతం చేసుకుంది. నైజాం(తెలంగాణ) ఏరియా హక్కులను ఏషియన్ ఎంటర్ ప్రయిజెస్ అధినేతలు నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్ లు 50 కోట్లకు దక్కించుకున్నారు. సీడెడ్ (రాయల సీమ) థియేటర్ హక్కులు 27 కోట్లకు అమ్ముడు పోయింది. ఉత్తరాంధ్ర, కృష్ణ ఏరియా హక్కులను 45 .5 కోట్లకు, నెల్లూరు(5 .6 ), ప్రకాశం (4 .2 ), గుంటూరు(11 .6 ) కోట్లు పలికాయి.

ఇక హిందీ రైట్స్ అత్యధికంగా 120 కోట్లకు కరణ్ జోహార్ సొంతం చేసుకున్నారు. పొరుగు రాష్ట్రాలు వారు కూడా కర్ణాటక (45 కోట్లు), కేరళ (10 .5 కోట్లు) భారీగానే చెల్లించారు. ఇక శాటిలైట్ హక్కులు కూడా ఓరేంజ్ లో అమ్ముడుపోయాయి. హిందీ 51, తెలుగు 26 కోట్లకు సంతకాలు జరిగిపోగా, మలయాళం, తమిళం హక్కులు ధరలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఆడియో రైట్స్ కోసం బడా కంపెనీలు క్యూలో ఉన్నాయి. వీటి ద్వారా 60 కోట్లు వస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన బిజినెస్ తోనే 500 కోట్ల మార్కుని దాటేసి బాహుబలి 2 సరికొత్త రికార్డుని నెలకొల్పింది. ఏప్రిల్ 28 న ఆ థియేటర్లోకి రానున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ ఇంకెన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus