Baahubali The Epic: పెద్ద ‘బాహుబలి’ ఇప్పుడు చిన్న తెర మీదకు.. స్ట్రీమింగ్‌ ఎక్కడ, ఎప్పుడు?

రీరిలీజ్‌ల యందు మా రీరిలీజ్‌ వేరయా అన్నట్లుగా విడుదలైన సినిమా ‘బాహుబలి: ది ఎపిక్‌’. ‘బాహుబలి: ది బిగినింగ్‌’, ‘బాహుబలి: ది కంక్లూజన్‌’ సినిమాలను మరోసారి ఎడిట్‌ టేబుల్‌ మీదకు తీసుకొచ్చి.. చాలావరకు కత్తిరించి ఓ సినిమాను సిద్ధం చేశారు రాజమౌళి అండ్‌ కో. అదే ఈ ‘బాహుబలి: ది ఎపిక్‌’. ఈ సినిమాను ‘బాహుబలి 1’ సినిమా వచ్చి పదేళ్లు అయిన సందర్భంగా విడుదల చేశారు. ఓ లెక్కన ఇది రీరిలీజ్‌, మరోలెక్కన రిలీజ్‌. ఆ విషయం పక్కనపెడితే.. ఇప్పుడు ఈ పెద్ద ‘బాహుబలి’ని చిన్నతెరలకు తీసుకొస్తున్నారు.

Baahubali The Epic

అవును, మీరు ఊహిస్తోంది కరెక్టే. ‘బాహుబలి: ది ఎపిక్‌’ సినిమాను ఓటీటీకి తీసుకొస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా డిసెంబర్‌ 25 నుండి ఈ కొత్త బాహుబలిని చూసేయొచ్చు. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించింది. రెండు భాగాల్లోని సుమారు 90 నిమిషాల స‌న్నివేశాలను తొలగించి మూడో ‘బాహుబలి’ని క్రియేట్‌ చేసి థియేటర్లలో అక్టోబర్‌ 31న విడుదల చేశారు. ‘బాహుబలి’ రెండు సినిమాల్లోని అవంతిక లవ్‌స్టోరీ, ‘పచ్చ బొట్టేసిన..’ పాట, ‘ఇరుక్కుపో..’ సాంగ్‌, ‘కన్నా నిదురించరా..’ సాంగ్‌, యుద్ధానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను తొలగించిన విషయం తెలిసిందే.

అయితే ఓటీటీలో నిడివి సమస్య ఉండదు కాబట్టి.. వాటిలో ఏదైనా కంటెంట్‌ని తిరిగి సినిమాలోకి తీసుకొచ్చి సర్‌ప్రైజ్‌ ఇస్తారేమో చూడాలి. ఇప్పటికే ఈ సినిమాను ముక్కలు ముక్కలుగా సోషల్ మీడియా, టీవీలో, ఓటీటీల్లో చూసిన ప్రేక్షకులు ఇప్పుడు పెద్ద ‘బాహుబలి’ని థియేటర్లలో చూస్తారో లేదో అని అనుకుంటుండగా సుమారు రూ.50 కోట్లు వసూలు చేసింది. మరిప్పుడు ఓటీటీలోకి వచ్చి ఎన్ని రోజులు ట్రెండింగ్‌లో ఉంటుందో చూడాలి.

ఇక ఈ సినిమా కోసం రాజమౌళి అండ్‌ కో. చాలా రోజులు కష్టపడి తిరిగి రీవర్క్‌ చేయించారు. కొన్ని మ్యూజిక్‌ల విషయంలో రీరికార్డింగ్‌ చేశారని సమాచారం. దీని కోసం మహేష్‌బాబు ‘వారణాసి’ సినిమా షూటింగ్‌కి కొన్ని రోజులు గ్యాప్‌ కూడా ఇచ్చారు.

చిరంజీవి – బాబీ సినిమాలో మలయాళ అగ్ర హీరో… తమిళ హీరోను కాదనుకొని…

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus