Bala, Surya: బేబమ్మ ఫస్ట్‌ తమిళ సినిమా ఆగిపోయింది

సినిమా మొదలై కొద్ది రోజులు అయినప్పటి నుండే.. ఉందా? లేదా? అనే అనుమానాలు వచ్చిన చిత్రం ‘వనన్‌గాన్‌’. తెలుగులో ‘అచలుడు’ అనే పేరుతో ఈ సినిమాను విడుదల చేస్తామని చాలా రోజుల క్రితమే టీమ్‌ ప్రకటించింది. అయితే ఇప్పుడు సినిమాను పూర్తిగా ఆపేశారు. ఈ సినిమాను సూర్య తప్పుకుంటున్నట్లు దర్శకుడు బాల వెల్లడించారు. దాంతోపాటు ఎందుకు సినిమా నుండి తప్పుకున్నది కూడా చెప్పారు. బాల, సూర్యది సూపర్ హిట్ కాంబినేషన్ అనే విషయం తెలిసిందే.

‘శివ పుత్రుడు’ లాంటి క్లాసిక్ వీరి కాంబోలోనే వచ్చింది. చాలా కాలం తర్వాత వారిద్దరూ కలిసి ‘వనన్‌గాన్‌’ అనే చిత్రాన్ని ప్రకటించారు. దాంతోపాటు ఓ లుక్‌ కూడా రిలీజ్‌ చేశారు. ఆ లుక్‌తో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను కన్యాకుమారిలో షూట్‌ చేశారు. అయితే ఈ సినిమా నుండి సూర్య వైదొలిగినట్టు బాల ప్రకటించారు. ‘‘తమ్ముడు సూర్యతో ‘వనన్‌గాన్‌’ సినిమాను తీద్దాం అనుకున్నాను.

అయితే కథలో కొన్ని మార్పుల వల్ల ఈ కథ సూర్యకి సూట్ అవుతుందా అనే సందేహం కలిగింది’’ అని చెప్పారు బాల. ‘‘నాపై, నా కథపై సూర్యకి పూర్తి నమ్మకం ఉంది. అంత ప్రేమ, గౌరవం, నమ్మకమున్న సూర్యకి చిన్న ఇబ్బంది కూడా కలగకుండా చూడటం నా కర్తవ్యం. అందుకే ఈ సినిమా విషయంలో ఇద్దరం చర్చించుకున్నాం. ఈ సినిమా నుండి సూర్య తప్పుకుంటాడని నిర్ణయం తీసుకున్నాం’’ అని చెప్పారు బాల.

ఇలా ఓ ప్రాజెక్ట్‌ ఆగిపోవడం బాధగా ఉన్నా, అతని శ్రేయస్సు కోసం తీసుకున్న నిర్ణయమిది అని కూడా చెప్పారు. అయితే సూర్య మాత్రమే సినిమా నుండి వైదొలిగాడు తప్ప.. సినిమా మాత్రం అలానే ఉంటుందట. అతని స్థానంలో వేరే హీరోతో ఈ సినిమా చేస్తారని సమాచారం. అన్నట్లు ఈ సినిమాతోనే మన బేబమ్మ కృతి శెట్టి కోలీవుడ్‌ ఎంట్రీ అవ్వాలి. కానీ ఆగిపోయింది. మరి ఏ హీరోతో చేస్తుందో చూడాలి.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus