Baladitya, Balakrishna: ఆ విషయంలో బాలయ్య గ్రేట్ అంటున్న బాలాదిత్య.. ఏం చెప్పారంటే?

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ఈ మధ్య కాలంలో ఏ సినిమాలో నటించినా ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటున్నారనే సంగతి తెలిసిందే. వరుస హిట్లతో బాలయ్య మార్కెట్, రేంజ్ అంచనాలకు మించి పెరుగుతోంది. ఇండస్ట్రీకి చెందిన చాలామంది హీరోలు సైతం బాలయ్యను ఎంతగానో అభిమానిస్తారనే సంగతి తెలిసిందే. నటుడు బాలాదిత్య బాలయ్య గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలయ్య గొప్పదనం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పెద్దలను, గురువులను, ఆడవాళ్లను గౌరవించే విషయంలో బాలయ్యకు ఎవరూ సాటిరారని ఆయన తెలిపారు. లైట్ బాయ్స్ తో సరదాగా మాట్లాడుతూ టీ తాగే హీరో బాలయ్య మాత్రమే అంటూ బాలాదిత్య చెప్పుకొచ్చారు. మా తాతగారి దగ్గరకు బాలయ్య ట్యూషన్ కు వచ్చేవారంటూ ఎవరికీ తెలియని విషయాలను ఆయన వెల్లడించారు. బాలాదిత్య బాలయ్య గొప్పదనం గురించి చెప్పిన విషయాలు ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

బాలయ్యకు ఎవరూ సాటిరారంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సైతం తెగ వైరల్ అవుతున్నాయి. వరుసగా మాస్, కమర్షియల్ సినిమాలకు ఓటేస్తున్న బాలయ్య బాబీ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. బాలయ్య బోయపాటి శ్రీను కాంబోలో అఖండ2 కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పొలిటికల్ కార్యక్రమాలతో సైతం బిజీ అవుతున్నారు.

హిందూపురం నుంచి మరోమారు ఎన్నికల్లో పోటీ చేయనున్న (Balakrishna) బాలయ్య ఎన్నికల్లో అనుకూల ఫలితాలను సొంతం చేసుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. బాలయ్య మాస్, క్లాస్ ప్రేక్షకులను మెప్పించే కథలకు ఓటేస్తూ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు. బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్లతో బాక్సాఫీస్ ను షేక్ చేసే దిశగా అడుగులు వేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు విడుదలయ్యేలా బాలయ్య ప్లానింగ్ ఉంది.

పవర్ స్టార్ నిజంగానే రూ.100 కోట్ల ఆస్తులు అమ్మారా.. ఏమైందంటే?

‘ఆపరేషన్ వాలెంటైన్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ ఎంతంటే?
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus