మొదటి రోజే కాపీ ట్రోల్స్ ఎదుర్కొంటున్న బలగం!

జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వేణు ప్రస్తుతం డైరెక్టర్ గా మారారు. ఈయన దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ప్రియదర్శి కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించిన చిత్రం బలగం. తెలంగాణ యాసలో రూపొందిన ఈ సినిమా నేడు ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక నేడు విడుదలైనటువంటి ఈ సినిమా మొదటి రోజే కాపీ వివాదంలో చిక్కుకుంది. బలగం సినిమా కథ నాది అంటూ జర్నలిస్ట్ గడ్డం సతీష్ అనే వ్యక్తి తీవ్రస్థాయిలో ఈ సినిమాపై ఆరోపణలు చేశారు.

ఈ సినిమా విడుదలైన అనంతరం జర్నలిస్టు గడ్డం సతీష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమా తనదేనని, నా కథను కాపీ కొట్టి ఈ సినిమా చేశారంటూ ఈయన ఆరోపణలు చేశారు. ఈ విధంగా జర్నలిస్ట్ ఈ సినిమా నాదే అంటూ ఆరోపణలు చేయడంతో అసలు ఈ బలగం కథ ఎవరిది? ఈ సినిమా కథ ఏంటి అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సతీష్ 2011వ సంవత్సరంలో తాను పచ్చికి అనే కథను రాసాను.

అయితే అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ యాసకు నిరాధారణకు గురికావడంతో.. ఈ కథ ప్రచూరణకు నోచుకోలేదు. దాంతో అప్పటి నుంచి నేను తెలంగాణ యాసలో కథలు రాయాలని నిర్ణయించుకున్నాను. 2014వ సంవత్సరంలో ఈ కథను నమస్తే తెలంగాణ పత్రికలో బతుకమ్మ మ్యాగ్జైన్ లో అచ్చు వేసారని తెలిపారు. ఈ కథ ఏంటి అనే విషయానికి వస్తే… సాధారణంగా ఒక మనిషి చనిపోయిన తర్వాత మూడవ రోజు, ఐదవ రోజు, 11వ రోజు పచ్చీకీ ముద్దలు పెడతారు.

అయితే ఈ అన్నం ముద్దను పక్షులు కనుక తింటే చనిపోయిన వ్యక్తి ఆత్మ శాంతిస్తుందనీ ఇప్పటికీ ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ఇప్పటికీ ఒక మనిషి చనిపోతే ఇదే ఆచారాన్ని పాటిస్తూ ఉన్నారు. దీని ఆధారంగానే తాను బలగం సినిమా కథను రాసుకున్నానని జర్నలిస్టు గడ్డం సతీష్ తెలిపారు. ఇక ఈ సినిమా చూస్తే కనుక అచ్చం నా కథనే సినిమాగా చేశారని 90% నేను రాసిన కథ సినిమాలో ఉందని, కేవలం 10 శాతం మాత్రమే మార్పులు చేశారని వెల్లడించారు.

ఇక ఈ సినిమా కథకు సంబంధించిన క్రెడిట్ మొత్తం తనకే ఇవ్వాలని అలాకాని పక్షంలో తాను చట్టపరంగా ముందుకు వెళ్తానని, ఈ విషయంపై ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా చర్యలు తీసుకోవాలని ఈయన కోరారు.మరి ఈ విషయంపై ఇప్పటివరకు దిల్ రాజు ఏ విధంగాను స్పందించలేదు. అయితే ఈ సినిమా మొదటి రోజు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నప్పటికీ ఇలా కాపీ ట్రోల్స్ ఎదుర్కోవడం గమనార్హం.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus