Balakrishna,Sampath Nandi: బాలయ్య.. మాస్ లైనప్ మాములుగా లేదు…!

ఇప్పుడున్న స్టార్ హీరోలకంటే సీనియర్ స్టార్ హీరోలే చాలా వేగంగా సినిమాలు ప్లాన్ చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ లిస్ట్ లో మొదట చెప్పుకోవాల్సింది నందమూరి బాలకృష్ణ గురించే.! ఈ పాండమిక్ టైములో కూడా ‘అఖండ’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి.. టాలీవుడ్ కు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చాడు బాలయ్య.గత ఏడాది విడుదలైన పెద్ద సినిమాల్లో ఎక్కువ లాభాలను అందించిన సినిమా ఇదే. అది కూడా తక్కువ టికెట్ రేట్లతో అంటే మాములు విషయం కాదు. ఇలా ‘అఖండ’ ని రిలీజ్ చేసాడో లేదో గోపీచంద్ మలినేని సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి రెడీ అవుతున్నాడు.

నవంబర్ లో ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇది బాలయ్యకి 107వ సినిమా. దీని తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేయబోతున్నట్టు బాలయ్య పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అలా అయితే అది బాలయ్య కెరీర్లో 108వ సినిమా అయ్యేది. కానీ అనిల్ రావిపూడి.. స్క్రిప్ట్ పై ఇంకా వర్క్ చేస్తున్నాడు. దాంతో ఈ గ్యాప్ లో బాలయ్య తన 108 వ సినిమా కోసం మరో దర్శకుడిని ఎంపిక చేసుకున్నాడట.అతనే సంపత్ నంది.

ఈ మధ్యనే వేములవాడలో సందడి చేసిన సంపత్ నంది తన తర్వాతి చిత్రం బాలకృష్ణతో చేయబోతున్నట్టు ప్రకటించాడు. స్క్రిప్ట్ కూడా రెడీ అయ్యిందని, వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి పాదాల చెంత స్క్రిప్ట్ ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించామని సంపత్ నంది చెప్పుకొచ్చాడు. అయితే బాలయ్య మాత్రం ఈ ప్రాజెక్టు గురించి ఎక్కడా చెప్పింది లేదు. బాలయ్యకి సెంటిమెంట్లు ఎక్కువ కాబట్టి మంచి రోజు చూసుకుని ఈ ప్రాజెక్టు గురించి అనౌన్స్ చేస్తాడేమో..! గతేడాది ‘సీటీమార్’ తో హిట్ కొట్టి మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు సంపత్ నంది. ఈసారి బాలయ్యతో పెద్ద హిట్టు కొడతాడేమో చూడాలి..!

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus