నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను ప్రస్తుతం NBK 111 అనే పేరుతో పిలుస్తున్నారు. ఇప్పటికే సెట్స్ మీదకు వచ్చిన ఈ సినిమాను రీసెంట్‌గా హోల్డ్ చేశారు. బాలకృష్ణకు రీసెంట్‌గా సర్జరీ అవ్వడం వల్ల ఆయన ప్రస్తుతం రెస్ట్ మోడ్‌లో ఉన్నారు. త్వరలోనే షూటింగ్‌లో పాల్గొంటారు అని చెబుతున్నారు. దీంతో గత కొన్ని రోజులుగా ఈ సినిమా అప్‌డేట్స్ లేవు. ఇప్పుడు ఈ సినిమా టీమ్ నుండి ఓ అనధికారిక సమాచారం బయటకు వచ్చింది.
ఈ సినిమాకు సంబంధించి రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ‘గాడ్’ ఒక టైటిల్ కాగా.. రెండోది ‘దాదా’ అని చెబుతున్నారు. వీటిలో ఏది బాగుంటుందనేది నిర్ణయం తీసుకొని త్వరలో అధికారికంగా అనౌన్స్ చేస్తారని చెబుతున్నారు. వచ్చే నెల నుంచి షూటింగ్ రీస్టార్ట్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలా సినిమా స్టార్ట్ అయిన సందర్భంలో సినిమా టైటిల్‌తో ఓ టీజర్‌ను అనౌన్స్ చేస్తారు అని అంటున్నారు. అలాగే సినిమా రిలీజ్ డేట్ విషయంలో కూడా క్లారిటీ ఇస్తారని సమాచారం.
ప్రస్తుతం చర్చలో ఉన్న పేర్లను చూస్తే.. రీసెంట్‌గా తెలుగులో రెండు పెద్ద సినిమాలకు పెట్టిన టైటిళ్లకు దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తోంది. దీంతో ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు రెండక్షరాల టైటిల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు అనే చర్చ మొదలైంది. పవన్ కల్యాణ్ ‘ఓజి’ అని పేరు పెట్టగా. అల్లు అర్జున్ ‘రాకా’ అని పేరు పెట్టారు. ఇక చిరంజీవి ‘కాకా’గా రాబోతున్నారు. దీంతో బాలయ్య సినిమాకు పెడతారు అంటున్న ‘గాడ్’ లేదా ‘దాదా’ అని పెడుతుండటం ఆసక్తికరంగా మారింది.
మామూలుగా అయితే సింహం అనే పేరు వచ్చేలా టైటిల్ పెడతారు అని తొలుత వార్తలొచ్చాయి. లేదంటే పేరులో ‘సింహ’ అనే పేరు వచ్చేలా చూసుకుంటారు అని అన్నారు. కానీ చూస్తే ఇప్పుడు ‘గాడ్’, ‘దాదా’ అంటున్నారు. చూద్దాం పంచ్ లైన్‌లా ఏమన్నా అలా పెడతారేమో.