మళ్లీ బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది…
- April 28, 2017 / 06:34 AM ISTByFilmy Focus
ఒక పక్క నందమూరి నట సింహం…మరో పక్క సూపర్ హిట్ దర్శకుడు బోయపాటి శ్రీను …ఇప్పటికే రెండు హిట్స్ ఇచ్చిన ఈ కాంబినేషన్ కట్ చేసి ఇంకో సినిమా తీస్తే బ్లాక్ బస్టర్ అంతే…మళ్ళీ తిరిగ్ చూడనవసరం లేదు…అవును ఒకటి కాదు రెండు కాదు…దాదాపుగా 6ఏళ్లు హిట్ ఏకుండా ఓపికగా వెయిట్ చేశారు నందమూరి అభిమానులు. అయితే ఆ ఓపికకి ఫలితంగా బాక్స్ ఆఫీస్ పై ఒక్కసారిగా సింహం గర్జిస్తె ఎలా ఉంటుందో…ఒక్కసారిగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రభనజనంతో షేక్ అయితే ఎలా ఉంటుందో….నిరూపించింది సింహ…అప్పటివరకూ కసిగా…ఆకలితో ఉన్న అభిమానులకి ఆకలి తీర్చింది. అయితే అదే క్రమంలో మళ్లీ అదే దర్శకుడికి లెజెండ్ రూపంలో మరో అవకాశం ఇచ్చాడు నట సింహం, ఇంకెముంది కట్ చేసి చూస్తే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టెర్ హిట్ సాధించడమే కాకుండా ఇప్పటికీ కర్నూల్ జిల్లాలో ఒక థియేటర్ లో దాదాపుగా 1100రోజులకు పైగా ప్రదర్శింపబడుతూ బాలయ్య సత్తా ఏంటో చూపించింది.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…ఈ మధ్యనే మన బోయపాటి శ్రీను పుట్టినరోజు జరుపుకున్నాడు. అయితే ఈ పుట్టిన రోజును పురస్కరించుకుని జరిగిన కొన్ని డిస్కషన్స్ లో, టాలీవుడ్ సినిమా సర్కిల్స్ లో వినిపిస్తున్న వాదన ప్రకారం, బోయపాటి బాలయ్యతో ఒక సినిమా తియ్యబోతున్నాడు అని, ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి, హ్యాట్రిక్ గా మారుతుంది అని టాక్ మొదలయింది, అయితే దీనిపై అటు బాలయ్య గాని, ఇటు బోయ పాటి శ్రీను గాని ఎక్కడ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు కానీ, వినిపిస్తున్న బజ్ చూస్తుంటే, బాక్స్ ఆఫీస్ సింహాన్ని మరి సారి బాక్స్ ఆఫీస్ పై వదలడానికి సిద్దం అవుతున్నాడు బోయపాటి…మరి హ్యాట్రిక్ హిట్ ఎంతటి ఘన వియజయం సాధిస్తుందో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















