KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

మనం మామూలుగా సంక్రాంతి సీజన్‌లో లేదంటే ఏదైనా పండగ సీజన్‌లో ఇద్దరు అగ్ర హీరోల సినిమా ఒకే డేట్‌కి, ఒకే సీజన్‌కి రావడం చూసుంటాం. ఆ క్లాష్‌ చూశాక.. కాస్త కంగారు పుట్టినా.. రెండు సినిమాలు విజయం సాధించి, మంచి వసూళ్లు అందుకుంటే ఆ ఆనందమే వేరు. ఇలాంటి పోటీలు ఎక్కువగా చిరంజీవి, బాలకృష్ణ మధ్య జరుగుతూ వచ్చాయి. ఈ సంక్రాంతికి కూడా ఈ స్టార్‌ క్లాష్‌ చూస్తాం అని అనుకున్నారంతా.

KING 100 – DADA

కానీ ఈ సారి క్లాష్‌ వారిద్దరి మధ్య జరగడం లేదు. అలా అని బాధపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం జరిగిన స్టార్‌ క్లాష్‌ ఇప్పుడు రిపీట్‌ అవ్వబోతోంది. అదే నందమూరి – అక్కినేని క్లాస్‌. నాగార్జున 100వ సినిమా ‘కింగ్‌ 100’ను డిసెంబరు 24న రిలీజ్‌ చేస్తామని ఇటీవల టీజర్‌తో ప్రకటించారు. ఇప్పుడు గ్లింప్స్‌తో ‘దాదా’ అంటూ బాలకృష్ణ సినిమాను అదే రోజు తీసుకొస్తామని ప్రకటించారు. దీంతో క్లాష్‌ ఫిక్స్‌ అయింది.

పదేళ్ల క్రితం 2016లో సంక్రాంతి సమయంలో ‘సోగ్గాడే చిన్నినాయ‌నా’, ‘డిక్టేట‌ర్’ వచ్చినప్పుడు ఈ క్లాష్‌ జరిగింది. మళ్లీ ఇప్పుడు జరుగుతోంది. అప్పుడు జరిగిన పోరులో నాగార్జున విన్నర్‌ కాగా.. ఇప్పుడు జరగబోయే పరీక్షలో ఎవరు విజేతగా నిలుస్తారు అనేది చూడాలి. ఇక్కడో విషయం ఏంటంటే.. ఈ రెండు సినిమాలు దాదాపు ఒకే నేపథ్యంలో రూపొందుతున్న ‘దాదా’ గ్యాంగ్‌స్టర్‌ మూవీ కాగా, ‘కింగ్‌ 100’ సినిమా మనీ మాఫియా చుట్టూ నడుస్తోంది.

కాబట్టి దాదాపు ఒకే లాంటి కథతో ఇప్పుడు ఇద్దరు హీరోలు రాబోతున్నారు. అయితే.. ఇక్కడ ఒకటే డౌట్‌. ఇద్దరూ అనుకున్నట్లుగా తమ సినిమాలను ఆ టైమ్‌కి తీసుకురాగలుగుతారా? అని. ఎందుకంటే టాలీవుడ్‌లో ప్రస్తుతం ఏ పెద్ద సినిమా కూడా అనుకున్న సమయానికి రావడం లేదు. ఇక బాలకృష్ణ సినిమా షూటింగ్‌ ఇప్పుడు జరగడం లేదు. శస్త్రచికిత్స కారణంగా బ్రేక్‌ ఇచ్చారు. త్వరలో షూటింగ్‌ మొదలుపెడతారట. చూద్దాం క్లాష్‌ కచ్చితంగా జరిగితే ఏమవుతుందో?

హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus